Eluru : జి. కొత్తపల్లిలో కత్తులాట.. గంజి ప్రసాద్‌‌ను ఎందుకు చంపారు ? సంచలన విషయాలు

జి.కొత్తపల్లి ఊరి చివర ఇంటి నుంచి గ్రామంలోకి వస్తుండగా గంజి ప్రసాద్‌ను ప్రత్యర్థులు అడ్డుకున్నారు. బైక్‌ నుంచి పడేసి దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కత్తులతో దాడికి పాల్పడడంతో తీవ్ర గాయాలయ్యాయి...

Eluru : జి. కొత్తపల్లిలో కత్తులాట.. గంజి ప్రసాద్‌‌ను ఎందుకు చంపారు ? సంచలన విషయాలు

Ganji Prasad Murder

YSRCP Leader Ganji Prasad : ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో హై టెన్షన్ కొనసాగుతోంది. వైసీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు చివరకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడికి కారణమైంది. ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్‌ హత్యతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉదయం గంజిప్రసాద్ హత్య జరిగింది. ఆయన కుటుంబాన్ని పరామర్శించేదుకు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు జి. కొత్తపల్లి వెళ్లారు. గ్రామస్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. పోలీసుల రక్షణ వలయంలో ఆయన్ను సురక్షితంగా ఓ స్కూల్ కు తరలించారు. బయటకు తీసుకెళితే.. గ్రామస్తులు దాడికి పాల్పడుతారని భావించిన పోలీసులు ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జి. కొత్తపల్లిలో హై టెన్షన్ శాతావరణం నెలకొంది.

Read More : G Kothapalli : జి.కొత్తపల్లిలో హై టెన్షన్.. పోలీసుల రక్షణలో ఎమ్మెల్యే తలారీ

జి.కొత్తపల్లి ఊరి చివర ఇంటి నుంచి గ్రామంలోకి వస్తుండగా గంజి ప్రసాద్‌ను ప్రత్యర్థులు అడ్డుకున్నారు. బైక్‌ నుంచి పడేసి దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కత్తులతో దాడికి పాల్పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. రక్తపుమడుగులో పడిపోయిన గంజి ప్రసాద్ అక్కడికక్కడనే మృతి చెందాడు. పాతకక్షల నేపథ్యంలో హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గ్రామంలో రోడ్డు పక్కన దుకాణాలు తొలిగించినందుకు కక్ష గట్టినట్లు సమాచారం. గంజి ప్రసాద్‌పై సురేశ్, హేమంత్‌, మోహన్ దాడి చేసినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసిన అనంతరం నిందితులు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. లొంగిపోయిన నిందితులకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సహకరించారంటూ గ్రామస్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యేపై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేయడంతో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

Read More : Andhra Pradesh : YCP నాయకుడు హత్య..పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తుల దాడి

గంజి ప్రసాద్‌ హత్యలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జి.కొత్తపల్లిలో ఇళ్ల స్కామ్‌ జరిగినట్టు గంజి ప్రసాద్ ఆరోపణలు చేస్తున్నారు. రూ.35 లక్షల వరకు స్కామ్‌ జరిగినట్టు ప్రసాద్‌ ఆరోపిస్తున్నారు.
ఇళ్ల స్థలాల స్కామ్‌ను ఎమ్మెల్యే వెంకట్రావు దృష్టికి తీసుకొచ్చినా ఆయన పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో సీఎం జగన్ దృష్టికి తీసుకెళుతానని గంజి ప్రసాద్ హెచ్చరించారు. గత సంవత్సర కాలంగా ఇదే అంశంపై గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తుతోంది. అదే సమయంలో గంజి ప్రసాద్‌ ప్రత్యర్థి వర్గం దుకాణాలు తొలగించడంతో మరింత ఆజ్యం పోసినట్లైంది. కక్షతో అత్యంత దారుణంగా గంజి ప్రసాద్‌ను చంపేసింది ప్రత్యర్థి వర్గం. ఏడాదిగా గొడవ జరుగుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోలేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు.