తిరుపతిలో ప్రియురాలితో కాపురం పెట్టిన లాయర్ భర్త గుట్టు రట్టు చేసిన భార్య

  • Published By: naveen ,Published On : November 7, 2020 / 12:46 PM IST
తిరుపతిలో ప్రియురాలితో కాపురం పెట్టిన లాయర్ భర్త గుట్టు రట్టు చేసిన భార్య

Updated On : November 7, 2020 / 1:24 PM IST

wife caught husband: చిత్తూరు జిల్లా తిరుపతిలో రెండిళ్ల పూజారి గుట్టురట్టయింది. భార్యను కాదని ప్రియురాలితో కాపురం పెట్టిన లాయర్‌ చంద్రమౌళి బాగోతం బయటపడింది. భార్య కవితను వదిలేసిన చంద్రమౌళి… ప్రియురాలితో కలిసి మరో ఇంట్లో కాపురం పెట్టాడు. చాలాకాలంగా భర్తపై నిఘా పెట్టిన కవిత… అతడి లవర్‌తో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అయితే భార్య రాగానే బెదిరిపోయిన చంద్రమౌళి… ఇంటి వెనుక నుంచి గోడ దూకి పరారయ్యాడు.

దీంతో ఆగ్రహించిన కవిత… భర్తతో అనైతిక సంబంధం పెట్టుకున్న మహిళపై దాడికి యత్నించింది. ఆ మహిళను ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి… భర్త బాగోతాన్ని అందరికీ చూపించింది. తనకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై ఆందోళనకు దిగింది. లాయర్‌ చంద్రమౌళిపై గతంలో కాల్‌మనీ కేసులున్నట్లు తెలుస్తోంది.