Dead Body in Parcel: పార్శిల్‌లో మహిళ ఇంటికి డెడ్‌బాడీ.. పశ్చిమ గోదావరి జిల్లాలో షాకింగ్ ఘటన
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మండలంలో యండగండి గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటికి పార్శిల్ లో ...

Dead Body
AndhraPradesh: పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మండలంలో యండగండి గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటికి పార్శిల్ లో గుర్తుతెలియని మృతదేహం వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి మహిళ దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడతలో సేవా సమితి టైల్స్ అందజేసింది. మరోసారి ఆర్థిక సాయం కోసం మహిళ దరఖాస్తు చేయడంతో విద్యుత్ సామాగ్రికి బదులు పార్శిల్ లో మృతదేహం వచ్చింది. మృతదేహం పార్శిల్ రావడంతో స్థానికులు భయాందోళన చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహం పార్శిల్ ఎవరు పంపించారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Gossip Garage : నల్గొండ సీఐ అరాచకానికి పచ్చని కాపురం చిన్నాభిన్నం..!
పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో ముదునూరి రంగరాజు అనే వ్యక్తి ఇంటికి డెడ్ బాడీ పార్శిల్ వచ్చింది. రంగరాజుకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్దమ్మాయి సాగి తులసి. గతంలో భర్తతో విబేధాలు కారణంగా తులసి తిరిగి యండగండి గ్రామంకు వచ్చింది. ప్రస్తుతం గరగపర్రు గ్రామంలో నివాసం ఉంటూ.. ఉద్యోగం చేసుకుంటుంది. ఆమెకు ఒక కూతురు ఉంది. తులసికి యండగండిలో జగనన్న కాలనీలో ఇంటి స్థలం వచ్చింది. ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకుంటుంది. ప్రస్తుతం ఆ ఇల్లు ప్లాస్టింగ్ స్టేజ్ లో ఉంది. అయితే, ఆర్థిక సాయంకోసం క్షత్రియ ఫౌండేషన్ లో గతంలో నమోదు చేసుకుంది. ఈ క్రమంలో ఈమెకు ఆర్థిక సహాయం నిమిత్తం గతంలో ఇంటి సామాన్లు వచ్చాయి. మహిళ తల్లిదండ్రులు యండగండిలోనే ఉండటంతో ఆ అడ్రస్ కి సామాగ్రి పంపించారు. పెయింట్ డబ్బాలు, టైల్స్ వచ్చాయి. అదేవిధంగా, మరోసారి సాయం కోసం క్షత్రియ ఫౌండేషన్ కు మహిళ దరఖాస్తు చేసుకుంది. గురువారం కరెంటు సామాన్లు, మోటారు సామాగ్రి వస్తాయని తులసి ఆమె తల్లిదండ్రులకు తెలియజేసింది. ఈ క్రమంలో సాయంత్రం సమయంలో ప్యాక్ చేయబడిన చెక్క పెట్టె వచ్చింది. దానికి తాళం కూడా వేసి ఉంది. పైన కవర్స్ కట్టి పార్సిల్ వచ్చింది.
Also Read: Virat Kohli : బాక్సింగ్‌డే టెస్టుకు ముందు.. మహిళా జర్నలిస్టుతో ఎయిర్‌పోర్టులో కోహ్లీ గొడవ..!
ఈ విషయాన్ని తులసికి సమాచారం ఇవ్వడంతో ఆమె ఇంటికి వెళ్లిన తరువాత పెట్టెను ఓపెన్ చేయగా.. దానిలో మూడు, నాలుగు కవర్లు పెట్టి ఉన్నాయి. ఒకదానిలో డెడ్ బాడీ ఉండగటాన్ని గుర్తించి భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉండి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిబ్బందితో వెళ్లి చూడగా, దానిలో సుమారు 45 సంవత్సరాలు ఉన్న గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు పార్శిల్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు పంపారని దానిపై విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలానికి పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ చేరుకుని వివరాలు సేకరించారు. పార్శిల్ లో ఓ లెటర్ కూడా ఉంది.రూ. 1.30 కోట్లు చెల్లించాలని, లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అందులో రాసి ఉంది. ఈ ఘటనలో తులసి కుటుంబ సభ్యులతోపాటు.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.