Bhumana Karunakar Reddy : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి ఓటమి ఖాయం- వైసీపీ నేత భూమన హాట్ కామెంట్స్

జగన్ సీఎం అయ్యాక ఈ కూటమి నేతలు చేస్తున్న పాపాలకు తగిన పరిహారం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నా..

Bhumana Karunakar Reddy : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి ఓటమి ఖాయం- వైసీపీ నేత భూమన హాట్ కామెంట్స్

Updated On : February 1, 2025 / 6:49 PM IST

Bhumana Karunakar Reddy : ఏపీ సీఎం చంద్రబాబు, కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన ఇన్ని నెలలు అవుతున్నా.. ఒక్క హామీని కూడా సీఎం చంద్రబాబు అమలు చేయలేదని భూమన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంపై తిరగబడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.

రేపటి ఎన్నికల్లో వైసీపీ గెలవడం, జగన్ సీఎం కావడం ఖాయం..
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చంద్రబాబును, ఆయన పార్టీని, కూటమిని పాతాళంలోకి తొక్కేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భూమన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రేపటి ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయం అని ఆయన జోస్యం చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి సీఎం కాకుండా పోరని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కూటమి నేతలు చేస్తున్న పాపాలకు తగిన పరిహారం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు భూమన కరుణాకర్ రెడ్డి.

Also Read : తల్లికి వందనం రూ.15వేలు, రైతులకు రూ.20వేలు డబ్బులపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..

ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు తిరగబడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు..
”ఎన్నికలు ఎప్పుడు జరిగినా చంద్రబాబు చేస్తున్న దాష్టీక పరిపాలనపై తిరగబడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చింది లేదు. జగన్ ఇచ్చిన హామీలను అన్నింటిని తుంగలోకి తొక్కి అంతకంటే ఎక్కువగా 2.5 లక్షల కోట్ల రూపాయల సాయం నేనే చేస్తానని సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పటివరకు ఒక్క హామీని నెరవేర్చలేదు.

మీ పాపాలకు తగిన పరిహారం చెల్లించుకోక తప్పదు..
ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారంటే ఈ క్షణాన ఎన్నికలు జరిగితే చంద్రబాబును పాతాళానికి తొక్కేస్తారు. చంద్రబాబు పార్టీని, కూటమిని పాతాళానికి తొక్కే విధంగా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. రేపు ఎన్నికల్లో వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరు. జగన్ సీఎం కాకుండా పోరు. జగన్ సీఎం అయ్యాక ఈ కూటమి నేతలు చేస్తున్న పాపాలకు తగిన పరిహారం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నా” అని భూమన అన్నారు.

”కూటమి నాయకులారా గుర్తు పెట్టుకోండి. రేపు మా ప్రభుత్వం వచ్చాక అంతకు అంత బదులు తీర్చుకోకపోము. ఎవరెవరు మా నాయకులు, కార్పొరేటర్లకు ఫోన్లు చేస్తున్నారో వారిని లొంగదీసుకోవడానికి భయపెడుతున్నారో వారందరిని వదలం. బదులు తీర్చుకోక వైసీపీ ఉండదని హెచ్చరిస్తున్నా.

Also Read : ఈసారి బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ పక్కానా? ఆ కీలకమైన పోస్ట్ ఆమెకేనా?

మీరు బెదిరిస్తే మా వాళ్లు బెదిరిపోతారని అనుకుంటే చాలా పొరపాటు..
తిరుపతిలో ఇప్పటివరకు ఎన్నడూ కూడా ప్రతీకార చర్యలు జరగలేదు. మేము ఐదేళ్లు అధికారంలో ఉన్నాం. ఒక్క టీడీపీ కార్యకర్త మీద కానీ, జనసేన కార్యకర్త మీద కానీ ఒక తప్పుడు కేసు బనాయించినట్లు నిరూపించండి. అలా నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం. అలాంటిది ఇవాళ మా వాళ్లను బెదిరిస్తున్నారు. మీరు బెదిరిస్తే మా వాళ్లు బెదిరిపోతారని అనుకుంటే చాలా పొరపాటు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి దుర్మార్గాలను సహించడం, ఉపేక్షించం” అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.