Phone Tapping In YCP : ముగ్గురు వచ్చారు,వెళ్లారు ఇప్పుడు నాలుగో కృష్ణుడు వచ్చారు : అధిష్టానంపై YCP MLA ఆనం సెటైర్లు

తమ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని నెల్లూరు రెడ్లు చేసిన వ్యాఖ్యలు వైసీపీలో సంచలనం కలిగిస్తున్నాయి. నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వైసీపీ అధిష్టానం ఖంగుతిన్నది. దీంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఈ సమస్యను పెద్దది చేయకూడదని..విమర్శలు చేసినవారిని అణిచివేయాలని ఆఘమేఘాలమీద ముఖ్య నేతలతో సమావేశమైంది. పార్టీ ఇన్ చార్జ్ ను నియమించటానికి కసరత్తులు మొదలుపెట్టింది. ఈక్రమంలో ముగ్గురు వచ్చారు..వెళ్లారు ఇప్పుడు నాలుగో కృష్ణుడు వచ్చారు అంటూ అధిష్టానంపై YCP MLA ఆనం సెటైర్లు వేశారు.

Phone Tapping In YCP : ముగ్గురు వచ్చారు,వెళ్లారు ఇప్పుడు నాలుగో కృష్ణుడు వచ్చారు : అధిష్టానంపై YCP MLA ఆనం సెటైర్లు

Phone Tapping In YCP

Phone Tapping In YCP : తమ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని నెల్లూరు రెడ్లు చేసిన వ్యాఖ్యలు వైసీపీలో సంచలనం కలిగిస్తున్నాయి. నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వైసీపీ అధిష్టానం ఖంగుతిన్నది. దీంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఈ సమస్యను పెద్దది చేయకూడదని..విమర్శలు చేసినవారిని అణిచివేయాలని ఆఘమేఘాలమీద ముఖ్య నేతలతో సమావేశమైంది. పార్టీ ఇన్ చార్జ్ ను నియమించటానికి కసరత్తులు మొదలుపెట్టింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అయితే మరో అడుగు ముందుకేసి తన ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది కేవలం ఆరోపణలు కాదు పచ్చి నిజం అంటూ సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందు బయటపెట్టారు. దీంతో మాటల దాడితో విరుచుకుపడేవారినిరంగంలోకి దింపి ఎదురు దాడి చేయిస్తోంది అధిష్టానం.

ఈక్రమంలో వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎమ్మెల్యేగా ఉండి స్థానిక సమస్యల్ని పరిష్కరించాలని అడగటం తప్పా? అది తప్పు అయితే ఇక ఎమ్మెల్యేగా ఉండి ఉపయోగమేంటి? ప్రశ్నిస్తున్నాననే అధిష్టానం నన్ను టార్గెట్ చేసిందని నా ఫోన్ ట్యాపింగ్ చేసారని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేనప్పుడు ఇక ఎమ్మెల్యే పదవులు ఎందుకు? అంటూ ప్రశ్నించారు. రోడ్లు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయి..నా నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించమని అడిగితే ఫోన్లు ట్యాప్ చేస్తారా? ఇలా సొంతపార్టీ వారిపైనా పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసినవారిని ఇలా అవమానిస్తారా? అంటూ నిలదీశారు.

Phone Tapping In YCP : నెల్లూరు వైసీపీలో మరో నిరసనగళం .. నిన్న ఆనం,కోటం రెడ్డి, తాజాగా మేకపాటి చంద్రశేఖరరెడ్డి

ఇప్పటికే ముగ్గురు పరిశీలకులు వచ్చి వెళ్లారు..ఇక నాలుగో కృష్ణుడు కూడా వచ్చాడు అంటూ అధిష్టానంపై సెటైర్లు వేశారు. ఇప్పటికే నెల్లూరులో పార్టీ రెండుగా చీలిపోయిందని . ఎంతమంది వచ్చి పోయినా సమస్యలు మాత్రం పరిష్కారం కావటంలేదంటూ విమర్శించారు. ఇక మూడు నాలుగుగా చీలిపోతే పార్టీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో 107 సచివాలయాలు ఉన్నాయని బహుశా ఆ మాత్రం కూడా పరిశీలకు తెలిసో తెలియదోనని అటువంటివారిని పరిశీలకులు ఉన్నారంటూ సెటైర్లు వేశారు ఆనం రామనారాయణ రెడ్డి. నిత్యం నియోజకవర్గంలోనే ఉంటు పనులు చేశామని కానీ పార్టీ అధిష్టానం నుంచి ఎటువంటి సహకారం అందలేదని..అయినా పార్టీ గెలుపు కోసమే కష్టపడ్డామని అటువంటి నాపై అనుమానాలు పడి ఫోన్ ట్యాపింగ్ చేయటం దురదృష్టకరమని అన్నారు.

Phone Tapping In YCP : కోటంరెడ్డి ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తే దాన్ని ట్యాపింగ్ అంటూ రాద్ధాంతమేంటీ : పేర్నినాని
40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటున్నానని కానీ ఎప్పుడూ తన రాజకీయ అనుభవంలో ఇటువంటి రాజకీయాలను చూడలేదంటూ వాపోయారు. అంతేకాదు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. మరో రెండు నెలల్లో మహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుడతామని అన్నారు. 2014లో వెంకటగిరి నుంచి పోటీ చేసిన రామ్ కుమార్ రెడ్డి మధ్యలోనే పారిపోయారని అన్నారు. మూడేళ్ల నుంచి నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు ఇవ్వటంలేదని దీనిపై న్యాయస్థానాలకు వెళదాం అంటూ తన అనుచరులకు పిలుపునిచ్చారు ఆనం. వెంకటగిరి నియోజకవర్గం టీడీపీకి చాల బలమైనది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నెల్లూరు జిల్లాలోని రాపూరు మండలం  నాయకులతో ఆనం సమావేశం అయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక ఆనం పార్టీ మారి తీరుతారనే వార్తలు హల్ చేయటంతో కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన ఆనం టీడీపీలోకి వెళతారా? లేక జనసేనా? లేక బీజేపీనా? అనేది తెలియాల్సి ఉంది. కానీ వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది అనటంతో ఆనం టీడీపీలో చేరతారనిపిస్తోంది.

MLA Kotamreddy Phone Tapping : సీఎం జగన్, సజ్జల ఆదేశాలు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

కాగా..నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన ట్యాపింగ్ ఆరోపణలు ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. దీనికి సంబంధించి సాక్ష్యాలను కూడా మీడియా ముందు కోటం రెడ్డి బయటపెట్టటంతో వైసీపీ అధిష్టానం ఖంగుతిన్నది. దీంతో సీఎం జగన్ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు హోంశాఖ కార్యదర్శిని పిలిపించి మాట్లాడారు. అలాగే నెల్లూరు రూరల్ స్దానంలో వైసీపీ ఇన్ ఛార్జ్ నియామకంపై చర్చిస్తున్నారు. నెల్లూరు రూరల్ జిల్లా ఇంఛార్జ్ బాధ్యతల్ని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.