YCP MLC Candidates Nominations : ఎమ్మెల్యే కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు

ఎమ్మెల్యే కోటాకు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పెనుమత్స సురేష్, కోలా గురువులు, ఇజ్రాయిల్, మర్రి రాజశేఖర్, జయమంగల వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసు రత్నం అసెంబ్లీ కార్యాలయంలో నామినేషన్లు వేశారు.

YCP MLC Candidates Nominations : ఎమ్మెల్యే కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు

AP MLC

YCP MLC Candidates Nominations : ఎమ్మెల్యే కోటాకు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పెనుమత్స సురేష్, కోలా గురువులు, ఇజ్రాయిల్, మర్రి రాజశేఖర్, జయమంగల వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసు రత్నం అసెంబ్లీ కార్యాలయంలో నామినేషన్లు వేశారు. ఏపీ శాసన మండలిలో మార్చి చివరి వారంలో ఖాళీ కానున్న పలు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం మార్చి6న రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి.

శాసన మండలి సభ్యుడు చల్లా భగీరధ్ రెడ్డి పదవీ కాలం గతేడాది నవంబరు 2వ తేదీతో ముగిసింది. ఈ నెల (మార్చి29)తో నారా లోకేశ్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద రావు, వరాహ వెంకట సూర్యనారాయణ రాజు పెనుమత్స, గంగుల ప్రభాకర్ రెడ్డిల పదవీకాలం ముగియనుంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖాళీల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గత నెల (ఫిబ్రవరి 27)న ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ను రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి మార్చి6న జారీ చేశారు.

MLC Elections Schedule : ఏపీ, తెలంగాణలో మరో 10 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్

అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయాలనుకునే వారు స్వయంగా లేదా వారి ప్రతిపాదకుడి ద్వారా గాని వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభా భవనంలో నామినేషన్లు దాఖలు చేయాలని తెలిపారు. రిటర్నింగ్ అధికారి లేదా సహాయ రిటర్నింగ్ అధికారి లేదా శాసన మండలి ఉప కార్యదర్శికి నామినేషన్లను సమర్పించవచ్చని చెప్పారు. ఈ నెల మార్చి6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు.. సెలవు దినాలు మినహా మిగతా పనిదినాల్లో ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని వివరించారు.

మార్చి 14వ తేదీన ఉదయం 11 గంటలకు అసెంబ్లీ భవనంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుందని అన్నారు. మార్చి 16వ తేది మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ ఉంటే ఈ నెల 23న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ భవనంలో పోలింగ్ జరుగుతుందని చెప్పారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి వెల్లడించారు.