YCP MP Vijayasai Reddy : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన.. రాజకీయాలకు గుడ్ బై..!
YCP MP Vijayasai Reddy : రాజ్యసభ సభ్యుత్వానికి రేపు (శనివారం) రాజీనామా చేస్తానని విజయసాయి ప్రకటించారు.

YCP MP Vijayasai Reddy Announced his retirement from Politics
YCP MP Vijayasai Reddy : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తాను పూర్తిగా తప్పుకుంటానని విజయసాయి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోనూ చేరనని ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుత్వానికి రేపు (జనవరి 25వ తేదీన) రాజీనామా చేస్తానని విజయసాయి ప్రకటించారు. పదవులు లేదా ప్రయోజనాలు ఆశించి తాను రాజీనామా చేయడం లేదని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టులో పేర్కొన్నారు.
“ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చేయలేదు. నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని” అని విజయసాయిరెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు.
వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటా :
“ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చేయలేదు. నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని” అని విజయసాయిరెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు.
జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. “పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్‌గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశానని చెప్పుకొచ్చారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా తాను పనిచేశానని కూడా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
దాదాపు 9 ఏళ్లుగా ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీతో రాజకీయంగా విభేదించానన్న ఆయన చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవన్నారు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉందని ఈ సందర్భంగా విజయసాయి చెప్పారు.
నా భవిష్యత్తు వ్యవసాయం :
రాజకీయలకు స్వస్తి పలికి ఇకపై భవిష్యత్తు వ్యవసాయమని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ‘సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను” అని వైసీపీ ఎంపీ విజయసాయి ముగించారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.
రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను.
ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు.
ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు.…
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 24, 2025
Read Also : Hyderabad Kidney Racket Case : హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసు.. సీఐడీకి అప్పగించిన ప్రభుత్వం