Hyderabad Kidney Racket Case : హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసు.. సీఐడీకి అప్పగించిన ప్రభుత్వం

భవిష్యత్తులో మరొకరు ఇలాంటి పని చేయాలంటే వణికిపోయేలా చర్యలుంటాయని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు.

Hyderabad Kidney Racket Case : హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసు.. సీఐడీకి అప్పగించిన ప్రభుత్వం

Updated On : January 24, 2025 / 6:45 PM IST

Hyderabad Kidney Racket Case : హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసును తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ చాలా సీరియస్ గా తీసుకుంది. ఇందులో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు, నిందితులను పట్టుకునేందుకు కిడ్నీ రాకెట్ కేసును సీఐడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.

భవిష్యత్తులో మరొకరు ఇలాంటి పని చేయాలంటే వణికిపోవాలి..
కిడ్నీ రాకెట్ అంశాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. ఈ రాకెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ పట్టుకోవాలని ఆదేశించారు. దోషులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. భవిష్యత్తులో మరొకరు ఇలాంటి పని చేయాలంటే వణికిపోయేలా చర్యలుంటాయని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు.

Also Read : ఇదెక్కడి బాధరా బాబూ.. సెకండ్ సిమ్‌కి నెలనెలా రీచార్జ్ చేయాల్సి వస్తుందనుకుంటున్నారా?.. బీఎస్ఎన్ఎల్ ఖతర్నాక్ రీచార్జ్ ప్లాన్..

ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగిన కిడ్నీ మార్పిడిల పైనా దర్యాఫ్తు..
ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ.. గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన ఆపరేషన్లపై విచారణ జరపనుంది. ఇప్పటివరకు ఎన్ని ఆసుపత్రుల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయని లోతుగా దర్యాఫ్తు చేయనుంది. ఇక రక్త సంబంధీకులే కిడ్నీ డొనేట్ చేశారా లేక ఇతరులు చేశారా అనేదానిపై సీఐడీ పూర్తి స్థాయిలో విచారణ జరపనుంది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగిన కిడ్నీ మార్పిడిల పైనా దర్యాఫ్తు చేయనుంది సీఐడీ.

పరారీలో తమిళనాడు డాక్టర్, మధ్యవర్తి ప్రదీప్..
హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. సర్జరీ చేసిన డాక్టర్లు, మధ్యవర్తుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 8మందిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న తమిళనాడు డాక్టర్ పవన్, మధ్యవర్తి ప్రదీప్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేసింది కమిటీ.

రష్యా, యుక్రెయిన్ దేశాలకు కిడ్నీ రాకెట్ కు సంబంధాలు ఉన్నాయా?
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అలకనంద ఆసుపత్రి నిర్వాహకుడు సుమన్ రష్యాలో ఎంబీబీఎస్ చేసినట్లు గుర్తించారు. దీంతో రష్యా, యుక్రెయిన్ దేశాలకు.. ఈ కిడ్నీ రాకెట్ కు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసుల దర్యాఫ్తు కొనసాగుతోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు డాక్టర్ సుమంత్. నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రిలో సర్జరీలు జరిగినట్లుగా గుర్తించారు అధికారులు.

మరోవైపు ఈ కేసుపై ఏర్పాటైన కమిటీ ప్రభుత్వానికి అందించిన నివేదికపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ సమావేశం అయ్యారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈ కేసును సీఐడీకి బదిలీ చేసింది ప్రభుత్వం. ఇక, ఈ కిడ్నీ రాకెట్ ఆపరేషన్స్ అలకనంద ఆసుపత్రిలో గత 6 నెలలుగా జరుగుతున్నట్లుగా గుర్తించారు అధికారులు.

ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ సుమంత్ రష్యాలోని ఎంబీబీఎస్ సర్టిఫికెట్ తో ఆసుపత్రి నడిపిస్తున్నట్లుగా విచారణలో తేలింది. అలాగే నెఫ్రాలజీకి సంబంధించి ఆసుపత్రికి ఎలాంటి అనుమతులు లేవని విచారణలో తేలింది. దీంతో పాటు 9 పడకల ఆసుపత్రికి పర్మిషన్ తీసుకుని ఏకంగా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని రన్ చేస్తున్నట్లుగా గుర్తించారు.

Also Read : ఎంత పక్కాగా ప్లాన్ చేసినా ఇక్కడ దొరికిపోయాడు.. మీర్ పేట్ మాధవి కేసులో ఆధారాలు దొరికేశాయ్