విజయసాయి ట్వీట్ : ఓపిక పట్టు ఉమా..మ్యావ్ మ్యావ్‌లు ఆపేయ్

ఓపిక పట్టు ఉమా..మ్యావ్ మ్యావ్‌లు ఆపేయ్ అంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సింహంలా గర్జించలేవు..ప్రాణాలు తీసిన హంతకుడివి..నువ్వు నీతులు వల్లిస్తే ఎలా అని ప్రశ్నించారు. కొన్ని రోజులుగా వైపీపీ, టీడీపీ మధ్య వార్ నెలకొంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. శాసనమండలిలో జరిగిన పరిణామాల అనంతరం తీవ్ర విమర్శలు చేసుకుంటుంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి..టీడీపీ నేత దేవినేని ఉమను టార్గెట్ చేశారు.
2020, జనవరి 25వ తేదీ శనివారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నువ్వెంత దోచుకున్నది, ఇసుక మాఫియా ద్వారా ఎన్నివేల కోట్లు పోగేసుకున్నది తొందర్లోనే బయట పడుతుందన్నారు. కాస్త ఓపిక పట్టు ఉమా..మ్యావ్ మ్యావ్ లు ఆపేయ్…నువ్వెంత గొంతు చించుకున్నా సింహంలా గర్జించ లేవు. ప్రాణాలు తీసిన హంతకుడివి అంటూ ఆరోపణలు చేశారు. నువ్వు నీతులు వల్లిస్తే ఎలా? అన్నారు.
అమరావతిలో బాబు పర్యటిస్తుండగా..ప్రజలు పూలు కురిపిస్తూ..బ్రహ్మరథం పట్టారని తెలుగు తమ్ముళ్లు వెల్లడించడంపై విజయసాయి రెస్పాండ్ అయ్యారు. పూల ఖర్చు వృథా అయినట్టేనా? కౌన్సిల్ లో ఏదో సాధించాడని పూల వర్షం కురిపించిన వారంతా తల పట్టుకుంటున్నారట అని ట్వీట్ ద్వారా వెల్లడించారు. రాజధాని సంగతి దేవుడెరుగు. కౌన్సిల్ కు ఎసరు పెట్టాడని సొంత పార్టీ వాళ్లే పిడకలు విసురుతున్నారని, ఒకేసారి అన్ని దిక్కుల నుంచి సుడిగాలి చుట్టముట్టిందేమిటి విజనరీ? అంటూ విజయసాయి ఎద్దేవా చేశారు.
* రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులు శాసనమండలిలో పాస్ కాలేదు.
* ఏపీ శాసనమండలి ఛైర్మన్ ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించారు.
* ఛైర్మన్ ఏకపక్షంగా వ్యవహరించారంటూ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
Read More :మున్సి పల్స్ కారు టాప్ గేర్ : అందరికీ ధన్యవాదాలు : KTR
* మండలి రద్దుకే సీఎం జగన్, మెజార్టీ సభ్యులు మొగ్గు చూపుతున్నారు.
* మండలి అవసరం ఏంటీ అనే ప్రశ్నను శాసనసభలో లేవనెత్తారు సీఎం జగన్.
* మండలి సభను నిర్వహించడం మూలంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న విషయాన్ని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు.
* అంతకంటే ముందు..సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీతో సీఎం జగన్ చర్చలు జరిపారు.
* సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశంలో మండలి రద్దుపై నిర్ణయం తీసుకొననున్నారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నువ్వెంత దోచుకున్నది, ఇసుక మాఫియా ద్వారా ఎన్ని వేల కోట్లు పోగేసుకున్నది తొందర్లోనే బయట పడుతుంది. కాస్త ఓపిక పట్టు ఉమా. మ్యావ్ మ్యావ్ లు ఆపేయ్. నువ్వెంత గొంతు చించుకున్నా సింహంలా గర్జించ లేవు. ప్రాణాలు తీసిన హంతకుడివి. నువు నీతులు వల్లిస్తే ఎలా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 25, 2020
పూల ఖర్చు వృథా అయినట్టేనా? కౌన్సిల్ లో ఏదో సాధించాడని పూల వర్షం కురిపించిన వారంతా తల పట్టుకుంటున్నారట. రాజధాని సంగతి దేవుడెరుగు. కౌన్సిల్ కు ఎసరు పెట్టాడని సొంత పార్టీ వాళ్లే పిడకలు విసురుతున్నారు. ఒకేసారి అన్ని దిక్కుల నుంచి సుడిగాలి చుట్టముట్టిందేమిటి విజనరీ?
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 25, 2020