AP Politics: టీడీపీలోకి వైసీపీ సిట్టింగ్‌లు.. తెలుగు దేశం పార్టీ నేతల గుండెల్లో రైళ్లు..

టీడీపీలో పార్థసారథి, వసంత కృష్ణ ప్రసాద్ చేరిక ఖాయమని పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. తిరువూరు నియోజకవర్గంలో..

AP Politics: టీడీపీలోకి వైసీపీ సిట్టింగ్‌లు.. తెలుగు దేశం పార్టీ నేతల గుండెల్లో రైళ్లు..

TDP Krishna District

Updated On : February 2, 2024 / 7:55 PM IST

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. టీడీపీ వైపు వైసీపీ సీటింగ్ ఎమ్మెల్యేలు చూస్తుండడమే ఇందుకు కారణం. టీడీపీలో పార్థసారథి, వసంత కృష్ణ ప్రసాద్ చేరిక ఖాయమని పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. తిరువూరు నియోజకవర్గంలో కొలికలపూడి శ్రీనివాసరావు కూడా తెరపైకి వచ్చారు. దీంతో ప్రస్తుత తిరువూరు ఇన్‌చార్జ్ శావల దేవదత్ ఆందోళనలో ఉన్నారు. పార్థసారధిని నూజివీడుకి ఒప్పించింది టీడీపీ హై కమాండ్.

మైలవరం, పెనమలూరు టీడీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. దేవినేని ఉమా వర్సెస్ వసంత కృష్ణ ప్రసాద్ గా పరిస్థితులు మారాయి. వీరిద్దరిలో ఒకరికి పెనమలూరు మరొకరికి మైలవరం కేటాయించేలా అధిష్ఠానం ఆలోచనలో ఉంది. ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల్లో వివిధ ఏజెన్సీల ద్వారా సర్వేలు నిర్వస్తోంది పార్టీ హైకమాండ్.

విజయవాడ పశ్చిమ టీడీపీలో గందరగోళం నెలకొంది. బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్ పోటాపోటీ బల ప్రదర్శనలు జరుగుతున్నాయి. విజయవాడ పశ్చిమ టికెట్ మైనార్టీలకు ఇవ్వాలంటూ రోడ్డు ఎక్కారు పలువురు టీడీపీ నేతలు. పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే సీట్లపై క్లారిటీ లేదు. విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ జనసేనకు అంటూ ప్రచారం జరుగుతోంది. నూజివీడులో ప్రస్తుతం ఇన్‌చార్జిగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఉన్నారు. తనని విస్మరిస్తే ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతానంటూ సందేశాలు ఇస్తున్నారు.

టీడీపీ గుంటూరు ఎంపీ టికెట్‌ ఎవరికి? సీటు కోసం ఆ ఇద్దరు ప్రముఖుల పోటీ