Eluru : పవన్ కళ్యాణ్ పై వైసీపీ, వాలంటీర్లు, దళిత సంఘాలు ఫైర్.. పవన్ దిష్టిబొమ్మలు దగ్ధం
ఏలూరు నగరంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు అవమానం జరిగిందంటూ దళిత సంఘాలు నిరసనకు దిగాయి.

Pawan Kalyan Effigies burnt
Pawan Kalyan Effigies Burnt : ఏలూరు జిల్లా వ్యాప్తంగా సచివాలయ వాలంటీర్లు, వైసీపీ శ్రేణులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. ఏలూరులో జిల్లా పంచాయతీ కార్యాలయం సెంటర్ లో పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. జంగారెడ్డిగూడెంలో పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఆదివారం ఏలూరు సభలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా జరుగుతుందని పవన్ కళ్యాణ్ విమర్శించారు.
వాలంటీర్లను తప్పు పట్టడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఏలూరు నగరంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు అవమానం జరిగిందంటూ దళిత సంఘాలు నిరసనకు దిగాయి. పవన్ కళ్యాణ్ అంబేద్కర్ కు క్షమాపణ చెప్పాలని MRPS నేతలు డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయాలని కోరారు.
సభకు వచ్చిన జనసేన కార్యకర్తలు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ఎదుటే అంబేద్కర్ విగ్రహం పైకి ఎక్కి కాళ్లతో తొక్కి అవమానించడం దారుణమని మండిపడ్డారు. ఈ తతంగం మొత్తం పవన్ కళ్యాణ్ ముందే జరుగుతున్నా జనసేన కార్యకర్తలను కనీసం వారించకపోవడాన్ని MRPS నేత కందుల రమేష్ తీవ్రంగా ఖండించారు.