యువకుల వేధింపులు తట్టుకోలేక యువతి సెల్ఫీ సూసైడ్

నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భక్తవత్సల నగర్ లో ఉంటున్న డిగ్రీ విద్యార్థిని రమ్య ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ముగ్గురు యువకులతో వాట్సాప్ చాట్ చేసిన ఆ యువతి సూసైడ్ చేసుకుంటున్న ఫోటోలను వారికి పంపించింది. ఆ తర్వాత సెల్ఫీ వీడియో తీసుకుని ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రమ్య మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటనపై రమ్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు యువకుల వేధింపులే రమ్య మృతికి కారణమని ఆమె సోదరుడు ఆరోపిస్తున్నారు. చనిపోయే ముందు కూడా రమ్య వారికి చెప్పిందని వాళ్లు పట్టించుకోలేదన్నారు. ఆ యువకులపై దిశ కేసు నమోదు చేయాలని కోరుతున్నారు.
నెల్లూరులోని భక్తవత్సల నగర్ లో నివాసముంటున్న కొండూరు రమ్య పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమె ఆత్మహత్య చేసుకోబోయే ముందు కొన్ని ఫోటోలను తీసుకొని సాయి, శివభార్గవ్, వాసు అనే ముగ్గురు యువకులకు వాట్సాప్ ద్వారా పంపించారు. అయితే వారి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ క్రమంలోనే రమ్య ఉరివేసుకుంటూ లైవ్ డెత్ రికార్డ్ చేసుకొని చనిపోయింది.
విషయం తెలుసుకొన్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకొని పరిశీలించారు. దీని ద్వారా ఎవరెవరితో చాటింగ్ చేసింది, ఫోటోలు పెట్టిందన్న విషయం బయటపడింది. శివ భార్గవ్ కు ఆమె మెస్సెజ్ చేసింది. ఆ మెసేజ్ లు చూస్తే రమ్యకు, శివభార్గవ్ కు మధ్య కొంత ఎఫైర్ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత కొంతకాలం నుంచి శివభార్గవ్ రమ్యతో మాట్లడం మానేశాడు. ఈ క్రమంలోనే రమ్య శివభార్గవ్ ను బతిమిలాడుకున్నట్లు తెలుస్తోంది. అనేక సార్లు కూడా మెస్సెజ్ లు పెట్టింది. ఈ వీడియోలో కూడా శివ భార్గవ్ ను ఒక్కసారి మాట్లాడమని బతిమిలాడుతున్నట్లు కనిపించింది. అయితే ఈ విషయంలో సాయి, వాసుల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురి యువకుల వేధింపులు, ప్రేమ వ్యవహారమే రమ్య మృతికి కారణమని చెప్పొచ్చు.