Ys Jagan: వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి జగన్ రూ.25లక్షల సాయం.. కూటమి ప్రభుత్వానికి జగన్ థ్యాంక్స్..
ఎంతో మందికి మురళీ నాయక్ స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు.

Ys Jagan: పాకిస్తాన్ కాల్పుల్లో అమరుడైన వీర జవాన్ అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. మురళీ నాయక్ కుటుంబసభ్యులను ఆయన ఓదార్చారు. మురళి తండ్రి శ్రీరామ్ నాయక్, తల్లి జ్యోతి బాయితో మాట్లాడారు. తాను అండగా ఉంటానని మురళీ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు జగన్. మురళీ నాయక్ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉంటుందన్నారు. ఎంతో మందికి మురళీ నాయక్ స్ఫూర్తిదాయకంగా నిలిచారని జగన్ అన్నారు. వైసీపీ తరపున మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల రూపాయల సాయం ప్రకటించారు జగన్.
Also Read: ఏపీ లిక్కర్ కేసు.. అరెస్ట్ భయంతో వణికిపోతున్న ఉన్నతాధికారులు..
కూటమి ప్రభుత్వానికి జగన్ థ్యాంక్స్..
వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి పరామర్శ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జవాన్ ఫ్యామిలీకి రూ.50లక్షలు ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి ఆయన థ్యాంక్స్ చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు 50 లక్షలు ఇచ్చే కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం మొదలు పెట్టిందన్నారు. దాన్ని కొనసాగిస్తున్నందుకు కూటమి సర్కార్ కు కృతజ్ఞతలు తెలిపారు జగన్. అలాగే పార్టీ తరపున 25 లక్షలు ప్రకటించారు జగన్.