ఏపీ రీస్టార్ట్ ప్యాకేజీ : ఎంఎస్ఎంఈలకు రెండో విడత ఆర్థిక ప్రోత్సాహం!

  • Published By: sreehari ,Published On : June 29, 2020 / 05:08 PM IST
ఏపీ రీస్టార్ట్ ప్యాకేజీ : ఎంఎస్ఎంఈలకు రెండో విడత ఆర్థిక ప్రోత్సాహం!

Updated On : June 29, 2020 / 5:34 PM IST

ఏపీలో MSMEలకు రెండో విడతగా ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. MSMEలకు రూ.548 కోట్లు విడుదల చేసినట్టు రాష్ట్ర సీఎం జగన్ ప్రకటించారు. ఇచ్చిన మాట.. చెప్పిన తేదీ ప్రకారం.. గత మే నెలలో మొదటి విడతగా 450 కోట్లు రిలీజ్ చేశామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

ఈసారి కూడా రిస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా మళ్లీ రూ. 512 కోట్లకు సంబంధించి రెండో దఫా నిధులు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం పెట్టిన బకాయిల్లో రూ. 827 కోట్లు కూడా చెల్లించినట్టు ఆయన చెప్పారు. ఈ వ్యవస్థను నిలబెట్టేందకు గానూ 1100 కోట్లు అడుగులు ముందుకు అడుగులు వేస్తున్నట్టు జగన్ తెలిపారు. వచ్చే ఏడాదిలోనూ దాదాపు 1000 కోట్లకు సంబంధించి పారిశ్రామిక రాయితీలపై మొత్తం బకాయిలను తీరుస్తామని హామీ ఇచ్చారు.

ఆ తర్వాతి ఏడాది కాలంలో ఇతర రంగాలకు కూడా మేలు చేకూర్చే విధంగా కార్యాచరణ చేస్తామన్నారు. రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను ఒక పద్ధతి ప్రకారం తీర్చుకుంటూ ముందుకు వెళ్తామని జగన్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు 98వేల ఎంఎస్ఎంఈ యూనిట్ల‌లో 10 ల‌క్షల మంది ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర ఆర్థికస్థితి బాగాలేకున్నా ఎంఎస్ఎంఈల‌ను ఆదుకునేందుకు రూ.1,168 కోట్లతో రీస్టార్ట్‌ ప్యాకేజీని ప్రకటించామని జగన్ తెలిపారు.

Read:రఘురాంపై ఎంపీ బాలశౌరిని అస్త్రంగా సంధించిన వైసీపీ