బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమాల్లో ఇంకా దారుణమైన డైలాగులు ఉంటాయి: జగన్
"అంత ఇబ్బందిగా ఉంటే అలాంటి డైలాగులు తీసేయించండి. ఇక సినిమాలు తియ్యడం ఎందుకు? అపేసెయ్యండి. ఏదైనా సినిమా డైలాగులు, పాటలు బాగుంటే అవి ఆదరణ పొందుతాయి" అని అన్నారు.

తన పర్యటనల వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయచుడు ఎన్నో కుట్రలు చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఇవాళ తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పుష్ప సినిమాలోని రప్పా రప్పా డైలాగును చెబుతూ వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయని కూటమి ప్రభుత్వం మండిపడుతున్న నేపథ్యంలో జగన్ దీనిపై స్పందించారు.
“వచ్చే వారిని అడ్డుకోవడం.. వచ్చినవారి పై కేసులు పెట్టడం.. ఆంక్షలు పెట్టడం, రెచ్చగొట్టడం, అల్లర్లు సృష్టించడం.. నా పర్యటనల్లో ఇదే జరుగుతుంది. సినిమా డైలాగులు పెడితే క్రిమినల్ కేసులు పెడుతున్నారు. ఆ డైలాగులు నచ్చకపోతే సెన్సార్ బోర్డులో తీసేయించండి. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమాల్లో ఇంకా దారుణమైన డైలాగులు ఉంటాయి.
Also Read: మరో లేడీ విలన్.. కూల్ డ్రింక్‌లో గడ్డిమందు కలిపి భర్తను చంపిన భార్య.. ఆ తర్వాత..
అంత ఇబ్బందిగా ఉంటే అలాంటి డైలాగులు తీసేయించండి. ఇక సినిమాలు తియ్యడం ఎందుకు? అపేసెయ్యండి. ఏదైనా సినిమా డైలాగులు, పాటలు బాగుంటే అవి ఆదరణ పొందుతాయి. హిట్ అయిన పాట పాడితే, తప్పు డైలాగ్ చెప్తే తప్పు అంటే ఎలా? జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నాకు భద్రత ఇవ్వడం లేదు.. ఒక్క పోలీసు సహకరించడం లేదు.
నేను పర్యటనలకు వెళ్తుంటే చంద్రబాబు చేస్తున్న రభస అంతా ఇంతా కాదు. ప్రజలు వస్తుంటే అడ్డుకోవడం.. లాఠీ ఛార్జ్ చెయ్యడం..ఇదెక్కడి దుర్మార్గం? నేను వెళ్తుంటే వేలాది మంది పోలీసులను పెడుతున్నారు. పోలీసులను పెట్టేది నాకు భద్రత కోసం కాదు.. వచ్చే వారిని అడ్డుకోడానికి” అని అన్నారు.