Ys Sharmila : కాంగ్రెస్ గూటికి వైఎస్ షర్మిల.. ఈనెల 4న వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటన
కాంగ్రెస్ గూటికి వైఎస్ షర్మిల.. ఈనెల 4న వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన షర్మిల

Ys Sharmila
Congress Party : వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ముహూర్తం ఫిక్స్ అయింది. 4వ తేదీన ఢిల్లీకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నుంచి షర్మిలకు ఆహ్వానం అందింది. రేపు లేదా ఎల్లుండి షర్మిల ఢిల్లీ వెళ్తారు. 4వ తేదీ ఉదయం 11 గంటలకు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు. షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే, షర్మిలకు ఏఐసీసీ పదవి అప్పగిస్తారా? ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగిస్తారా? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతుంది. రాహుల్ గాంధీ షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అలాకాకుంటే ఏఐసీసీ, సిడబ్ల్యుసీలో ఏదైనా ఒక పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read : Nara Bhuvaneshwari : మళ్లీ ప్రజల్లోకి నారా భువనేశ్వరి.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మూడు రోజులు పర్యటన
ఇదిలాఉంటే.. ఖర్గే నుంచి ఫోన్ రాగానే అందుబాటులో వైఎస్ఆర్టీపీ నాయకులు, కార్యకర్తలతో మంగళవారం ఉదయం షర్మిల లోటస్ పాండ్ లో భేటీ అయ్యారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం ఎందుకు చేయాల్సి వస్తుందనే విషయాలపై షర్మిల వారికి వివరించనున్నారు. దీనికితోడు షర్మిల ఏపీ కాంగ్రెస్ రాజకీయాల్లోకి వెళితే తెలంగాణలోని వైఎస్ఆర్టీపీ నేతలు, కార్యకర్తల భవిష్యత్తు ఏమిటి? కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుందనే విషయాలపై ఈ భేటీలో నేతలతో షర్మిల చర్చించినట్లు సమాచారం. అయితే, ఈ సమావేశంలో ఏపీ కాంగ్రెస్ లో ఏ బాధ్యతలు స్వీకరించబోతున్నారని పార్టీ నేతలు ప్రస్తావించగా.. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నానని షర్మిల చెప్పినట్లు తెలిసింది. సమావేశం అనంతరం షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు. 4వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని, వైఎసఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరుగుతుందని షర్మిల తెలిపారు.
Also Read : Siddaramaiah : సిద్ధరామయ్యే మా రాముడు…కర్ణాటక కాంగ్రెస్ నాయకుడి సంచలన వ్యాఖ్యలు
వైఎస్ షర్మిల మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి కడప వెళ్తారు. అక్కడ నుంచి సాయంత్రం 4గంటలకు ఇడుపులపాయ చేరుకొని తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియాలకు వివాహం నిశ్చమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. నూతన వధూవరులు, కుటుంబ సభ్యులతో కలిసి షర్మిల వైఎస్ఆర్ ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ కార్యక్రమం తరువాత కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం, కాంగ్రెస్ పార్టీలో చేరికపై షర్మిల స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.