YS Sunitha : వైఎస్ వివేక హత్య కేసు.. సీబీఐకి సంచలన విషయాలు వెల్లడించిన సునీత

రెండు కుటుంబాల మధ్య దశాబ్ధాల విబేధాలు ఉన్నాయని 2019 జులైలో అవినాశ్ పై తనకు అనుమానం మొదలైందని చెప్పారు. వివేక మృతి విషయం బయటికి రాకముందే తన కుమారుడికి తెలుసని ఉదయ్ కుమార్ రెడ్డి తల్లి ఒకరితో చెప్పారని తెలిపారు.

YS Sunitha : వైఎస్ వివేక హత్య కేసు.. సీబీఐకి సంచలన విషయాలు వెల్లడించిన సునీత

YS Sunitha

YS Sunitha – YS Viveka Case : ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తే సునీత సీబీఐకి సంచలన వాంగ్మూలం ఇచ్చారు. సునీత సీబీఐకి కీలక విషయాలు వెల్లడించారు. అవినాశ్ అభ్యర్థిత్వత్వాన్ని వివేక కోరుకోలేదని తనకు తెలుసన్నారు. రెండు కుటుంబాల మధ్య దశాబ్ధాల విబేధాలు ఉన్నాయని 2019 జులైలో అవినాశ్ పై తనకు అనుమానం మొదలైందని చెప్పారు. వివేక మృతి విషయం బయటికి రాకముందే తన కుమారుడికి తెలుసని ఉదయ్ కుమార్ రెడ్డి తల్లి ఒకరితో చెప్పారని తెలిపారు.

అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డికి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు కాబట్టి అనుమానం వచ్చిందన్నారు.మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను సీబీఐ సాక్షిగా చేర్చింది. ఆమెను 259వ సాక్షిగా పేర్కొంటూ సీబీఐ కోర్టుకు వాంగ్మూలం ఇచ్చింది.  తన వద్ద ఆధారాలు లేవు కానీ, రాజకీయ కారణంగానే హత్య జరిగిందని షర్మిల భావిస్తున్నట్లు వాంగూల్మం ఇచ్చారని సీబీఐ కోర్టుకు తెలిపింది. హత్యకు కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు కారణం కాదని, పెద్ద కారణం ఉండవచ్చని చెప్పారని తెలిపారు.

YS Viveka Case : వైఎస్ వివేకా కేసులో సీఎం జగన్ పేరు.. సీబీఐ సంచలనం

అవినాశ్ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలబడటమే కారణం కావొచ్చని, వారికి అడ్డొస్తున్నారని మనసులో పెట్టుకుని ఉండవచ్చని తెలిపారని వెల్లడించారు. హత్యకు కొన్ని నెలల ముందు బెంగళూరులోని తన ఇంటికి వివేకా వచ్చారని, కడప ఎంపీగా పోటీ చేయాలని తనను అడిగారని, అవినాశ్ కు టికెట్ ఇవ్వకుండా ఎలాగైనా జగన్ ను ఒప్పిద్దామన్నానని చెప్పారని వాంగ్మూలంలో పేర్కొన్నారు.

జగన్ కు వ్యతిరేకంగా తాను వెళ్లనని వివేకా ఆలోచించారని, తనకు జగన్ మద్దతు ఇవ్వరని తెలుసు కాబట్టి ఎంపీగా పోటీకి మొదట ఒప్పుకోలేదని, బాబాయ్ ఒత్తిడి మేరకు అంగీకరించినట్లు పేర్కొన్నారు.
ఎంపీగా వివేకానే పోటీ చేయకుండా మీపై ఎందుకు ఒత్తిడి తెచ్చారని సీబీఐ ప్రశ్నించగా, బహుశా ఎమ్మెల్సీగా ఓడిపోయినందున ఆసక్తి చూపకపోయి ఉండొచ్చని, విజయమ్మపై పోటీ చేశాక కొంతదూరం పెరిగిందని తెలిపారు. ఆ కారణంగా ఎలాంటి టికెట్ దక్కకపోవచ్చని వివేకా భావించారని తెలిపారు.

Nara Lokesh : వైఎస్ వివేకా హత్య కేసులో ఇద్దరబ్బాయిలు జైలుకు వెళ్ళడం ఖాయం : నారా లోకేశ్

ఎమ్మెల్సీగా ఆయన ఓటమికి తనకు తెలిసినంత వరకు అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కొందరు సన్నిహుతులే కారణమని తెలిపారు. కుటుంబంలో అంతా బాగున్నట్లు కనిపించినా.. లోపల కోల్డ్ వార్ ఉండేదని షర్మిల వాంగ్మూలం ఇచ్చినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో వైఎస్ షర్మిల నుంచి సీఎం జగన్ అటెండర్ నవీన్ ను కలిపి మొత్తం 259 మంది వాంగ్మూలాలను సీబీఐ సేకరించింది.

గతేడాది అక్టోబర్ 7న ఢిల్లీలో సీబీఐ వైఎస్ షర్మిల వాంగూల్మం తీసుకుంది. వాటిని గత నెల(జూన్) కోర్టుకు అందజేసింది. వివేకా హత్య కేసులో సీఎం జగన్ ఓఎస్ డీ పి.కృష్ణ మోహన్ రెడ్డి, రిటైర్డ్ సీఎస్ అజేయం కల్లం, వైసీసీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ అటెండర్ గోపరాజు నవీన్ కుమార్ సాక్షులుగా ఉన్నట్లు కోర్టుకు తెలిపింది.