YSRCP Letter: విజయమ్మ లేఖకు కౌంట‌ర్‌గా వైసీపీ బహిరంగ లేఖ..

వైఎస్ఆర్ కుటుంబంపై నిత్యం కుట్రలు పన్నే చంద్రబాబుకు రాజకీయంగా మేలుచేసేలా వ్యవహరించడం ధర్మమేనా? అంటూ వైసీపీ విడుదల చేసిన లేఖలో

YSRCP Letter: విజయమ్మ లేఖకు కౌంట‌ర్‌గా వైసీపీ బహిరంగ లేఖ..

Ys Jagan and Sharmila

Updated On : October 30, 2024 / 2:32 PM IST

YSRCP Clarification Letter: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన చెల్లి వైఎస్ షర్మిళ మధ్య ఆస్తుల వివాదంపై వైఎస్ అభిమానులకు విజయమ్మ బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖలో రాజశేఖరరెడ్డి బతికి ఉండగా ఆస్తులు పంచలేదని ఆమె స్పష్టం చేశారు. ఆస్తులు ఇద్దరికీ సమానమనేది నిజమని విజయమ్మ పేర్కొన్నారు. జగన్, షర్మిళ మధ్య ఆస్తుల వివాదంకు సంబంధించి పలు విషయాలను ఆమె ప్రస్తావించారు. అయితే, వైఎస్ విజయమ్మ లేఖకు కౌంటర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది పేజీల లేఖను విడుదల చేసింది. విజయమ్మను అమితంగా గౌరవిస్తాం. వైఎస్ఆర్ కుటుంబ వ్యవహారంపై విజయమ్మ బహిరంగ లేఖ విడుదల చేసిన నేపథ్యంలో కొన్ని అంశాలను ఆమె ముందుకు, ప్రజల ముందుకు తీసుకువస్తున్నామని లేఖలో ప్రస్తావించారు.

Also Read: Ys Vijayamma : తల్లిగా అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండటం నా ధర్మం.. నా సమక్షంలోనే ఆస్తుల పంపకం జరిగింది : విజయమ్మ బహిరంగ లేఖ

జగన్ మోహన్ రెడ్డిని లీగల్ గా ఇబ్బంది పెట్టేందుకు, తద్వారా బెయిల్ రద్దుకు జరిగిన కుట్ర వ్యవహారాన్ని కనీసం విజయమ్మ లేఖలో ప్రస్తావించకపోవడం ప్రజలను పక్కదోవపట్టించడమేనని వైసీపీ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. సరస్వతీ కంపెనీ విషయంలో ఈడీ అటాచ్ మెంట్ ఉన్నప్పటికీ, తెలంగాణ హైకోర్టు స్టేటస్ -కో ఆదేశాలు ఉన్నప్పటికీ, సరస్వతీ కంపెనీ విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయొద్దని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిల సహా న్యాయసలహాలు ఉన్నప్పటికీ.. తప్పుఅని తెలిసినా మోసపూరితంగా, కుట్రపూరితంగా షేర్లు బదిలీ చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. షర్మిళ భావోద్వేగాలకు, ఒత్తిళ్లకుగురై జగన్ కు న్యాయపరంగా, చట్టపరంగా చిక్కులు తెచ్చే కుట్ర జరుగుతుందని తెలిసినా విజయమ్మ ఆమోదించి సంతకం పెట్టడం నిజం కాదా అని ప్రశ్నించారు.

Also Read: Kapil Dev – Chandrababu : ఏపీ సీఎం చంద్ర‌బాబుతో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ భేటీ..

వైఎస్ఆర్ కుటుంబంపై నిత్యం కుట్రలు పన్నే చంద్రబాబుకు రాజకీయంగా మేలుచేసేలా వ్యవహరించడం ధర్మమేనా? అంటూ వైసీపీ విడుదల చేసిన లేఖలో విజయమ్మను ప్రశ్నించారు. తెలంగాణలో రాజకీయాల పేరిట అడుగుపెట్టిన నాటినుంచి అవకాశం ఉన్నప్పుడల్లా జగన్ మోహన్ రెడ్డిపై షర్మిల విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో జగన్ పై దాడి జరిగితే ఎగతాళి చేసి, అమానవీయంగా మాట్లాడారు. వీటన్నింటినీ జగన్ ఓపికతో భరించారు. అయినా, మరి రచ్చకెక్కింది ఎవరు? వైఎస్ఆర్ ఫ్యామిలీ పరువు తీసింది ఎవరు? నిజమైన బాధితులు ఎవరు? జగన్ కాదా.. అంటూ లేఖలో ప్రశ్నించారు.