YSR Kadapa : వైయస్సార్ వర్ధంతి, కడపకు సీఎం జగన్, షర్మిల

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కడపలో పర్యటించనున్నారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకూడా కడపకు రానున్నారు.

YSR Kadapa : వైయస్సార్ వర్ధంతి, కడపకు సీఎం జగన్, షర్మిల

Sharmila

Updated On : September 1, 2021 / 8:28 AM IST

YSR Vardhanthi : ఏపీ ముఖ్యమంత్రి జగన్ కడపలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా 2021, సెప్టెంబర్ 01వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కడప బయలుదేరనున్నారు. సాయంత్రం 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుని పార్టీ నాయకులతో భేటికానున్నారు. ఆ తర్వాత వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్ హౌస్‌లో రాత్రికి బస చేస్తారు సీఎం జగన్.

Read More : Pari Paswan : నాకు మత్తు ఇచ్చి పోర్న్ ఫిల్మ్ తీశారు.. మాజీ మిస్‌ యూనివర్స్‌ షాకింగ్ కామెంట్స్!

సీఎం జగన్ టూర్ సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వైయస్సార్‌ వర్దంతి సందర్భంగా గురువారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు సీఎం జగన్‌. ఆ తర్వాత మరోసారి పార్టీ నాయకులతో సీఎం జగన్‌ భేటీ అవుతారు. అదే రోజు ఉదయం పదకొండున్నర గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 12 గంటల 45 నిమిషాలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Read More : Mukku Avinash : ఓ ఇంటివాడు కాబోతున్న ముక్కు అవినాష్

సిమ్లా పర్యటన నుంచి మంగళవారం తాడేపల్లికి చేరుకున్నారు సీఎం జగన్‌. ఈనెల 26న కుటుంబ సభ్యులతో కలిసి సిమ్లా పర్యటనకు వెళ్లారు. ఐదు రోజుల పాటు అక్కడ పర్యటించారు.

Read More : Sachin Pilot : త్వరలో రాజస్థాన్ కేబినెట్ విస్తరణ.. గెహ్లాట్ మంత్రివర్గంలోకి పైల‌ట్‌..!

మరోవైపు… వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకూడా కడపకు రానున్నారు. హైదరాబాద్ నుంచి  ప్రత్యేక చాపర్లో 2021, సెప్టెంబర్ 01వ తేదీ బుధవారం కడపకు రానున్నారు. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా ఇడుపులపాయ చేరుకొని…అక్కడ తన ఎస్టేట్‌లో బస చేయనున్నారు. గురువారం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో షర్మిల పాల్గొననున్నారు.