YSRCP : మంగళగిరికి చిరంజీవి.. వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం

ఇక గాజువాక వైసీపీ ఇంఛార్జిగా ఉన్న దేవన్ రెడ్డి రాజీనామా తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా సమాచారం అందుతోంది.

YSRCP : మంగళగిరికి చిరంజీవి.. వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం

YSRCP New Incharges

అధికార వైసీపీలో రాజీనామాల అలజడి రేగింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే రాజీనామా చేయగా, తాజాగా గాజువాక వైసీపీ ఇంఛార్జి దేవన్ రెడ్డి రిజైన్ చేశారు. ఇంఛార్జీలు రాజీనామా చేస్తున్న చోట్ల వైసీపీ దృష్టి పెట్టింది. గాజువాక ఇంఛార్జిగా మంత్రి అమర్నాథ్ ను నియమించే అవకాశం కనిపిస్తోంది.

ఇక గాజువాక వైసీపీ ఇంఛార్జిగా ఉన్న దేవన్ రెడ్డి రాజీనామా తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా సమాచారం అందుతోంది. దేవన్ రెడ్డి స్థానంలో మంత్రి అమర్నాథ్ ను ఇంఛార్జిగా నియమించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు మంగళగిరి వైసీపీ ఇంఛార్జిగా గంజి చిరంజీవిని నియమించబోతున్నారు. ఆయన సీఎం జగన్ తో భేటీ అయ్యారు.

Also Read : ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాకు అసలు కారణాలు అవేనా..? ఏదైనా వ్యూహం ఉందా

రాజీనామా విషయం తెలిసిన వెంటనే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో దేవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. తిప్పల నాగిరెడ్డి కుటుంబానికి ఈసారి గాజువాక వైసీపీ టికెట్ ఇవ్వకపోతే మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తామన్నారు. తిప్పల నాగిరెడ్డి గాజువాక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సోదరుడు వైసీపీ కార్పొరేటర్ గా ఉన్నారు. కుటుంబం మొత్తం రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తేల్చి చెప్పారు.

2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా తిప్పల నాగిరెడ్డి గాజువాక నుంచి పోటీ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసినా ఓడిపోయారు. అంతేకాకుండా గాజువాకలో టీడీపీ కీలక నేత పల్లా శ్రీనివాస రావు లాంటి కీలక నేతలు పోటీ చేసినప్పటికీ.. తిప్పల నాగిరెడ్డి విజయం సాధించారు. తిప్పల నాగిరెడ్డి గెలుపులో దేవన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. దేవన్ రెడ్డి అందరినీ కలుపుకుని పోయారు. అయితే, వయసురిత్యా ఈసారి తిప్పల నాగిరెడ్డి పోటీ చేయరని ముందు నుంచే చెబుతున్నారు.

ఇక.. దేవన్ రెడ్డికి కార్పొరేటర్ పదవి ఇచ్చినా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. తిప్పల నాగిరెడ్డి పోటీ చేయనని చెప్పడంతో ఆయన తనయుడు దేవన్ రెడ్డికి కచ్చితంగా ఈసారి వైసీపీ టికెట్ వస్తుందని భావించారు. అయితే, అనూహ్యంగా గాజువాక టికెట్ రాదని వైసీపీ అధిష్టానం నుంచి సమాచారం అందడంతో దేవన్ రెడ్డి ఇంఛార్జి పదవికి రాజీనామా చేసేశారు.

Also Read : జగన్ చావుని వాళ్లు కోరుకుంటున్నారు, అందుకే జనసేనకి చంద్రబాబు సపోర్ట్ చేయలేదు- పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు

నాగిరెడ్డి కుటుంబానికి కనుక టికెట్ ఇవ్వకపోతే మరిన్ని రాజీనామాలు ఉంటాయని హెచ్చరించారు. కార్పొరేటర్లు, నాయకులు రిజైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ కేడర్ చెబుతోంది. దేవన్ రెడ్డి రాజీనామాతో గాజువాక వైసీపీ ఇంఛార్జిగా గుడివాడ అమర్నాథ్ పేరు ప్రచారంలో ఉంది. మొత్తంగా గాజువాక నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి.