Posani Krishna Murali : జగన్ చావుని వాళ్లు కోరుకుంటున్నారు, అందుకే జనసేనకి చంద్రబాబు సపోర్ట్ చేయలేదు- పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు కాపులని, పవన్ కల్యాణ్ ని ముంచుతాడు అని హెచ్చరించారు. ఏపీలో కూడా చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి పోటీ చేయొచ్చు కదా అని పోసాని అన్నారు. చంద్రబాబుకి కాపు ఓట్లు కావాలి. కానీ, అధికారం మాత్రం కాపులకి ఇవ్వరు అని మండిపడ్డారు.

Posani Krishna Murali : జగన్ చావుని వాళ్లు కోరుకుంటున్నారు, అందుకే జనసేనకి చంద్రబాబు సపోర్ట్ చేయలేదు- పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు

Posani Krishna Murali Sensational Words

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు ఏపీ ఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి. ఏపీ సీఎం జగన్ చావుని టీడీపీ వాళ్లు కోరుకుంటున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారాయన. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఏపీ రాజకీయాలను ఎలా పోలుస్తారు అంటూ ధ్వజమెత్తారు. ఏపీలో జనసేనతో పొత్తు ఉండి, తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎలా మోశారు? అంటూ నిలదీశారు. పవన్ కల్యాణ్ అమాయకుడు అని, ఆయనను చంద్రబాబు మోసం చేస్తున్నారని పోసాని కృష్ణ మురళి ఆరోపించారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ 4 సీట్లు గెలిస్తే.. ఆంధ్రలో ఎక్కువ సీట్లు అడుగుతాడనే కుట్రపూరితంగా చంద్రబాబు వ్యవహరించారని పోసాని ఆరోపణలు చేశారు.

”ఏపీలో టీడీపీ కలలు కంటోంది. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయారు కాబట్టి ఏపీలో జగన్ ఓడిపోతారని టీడీపీ నేతలు అంటున్నారు. ఒకవేళ కేసీఆర్ గెలిచి ఉంటే.. జగన్ గెలుస్తాడని అనే వారా? తెలంగాణలో జనసేనకు సపోర్ట్ చేయని టీడీపీ.. ఏపీలో సైతం జనసేనను వదిలేయాలి? టీడీపీకి అంతా సత్తా ఉంటే తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదు?” అని విరుచుకుపడ్డారు పోసాని.

కుండలు తయారు చేసేవాడు అమ్ముకోవాలి కానీ తన్నకూడదు అని పోసాని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనా పోసాని స్పందించారు. హాట్ కామెంట్స్ చేశారు. అసలు బీఆర్ఎస్ కి, వైసీపీకి సంబంధం ఏంటి? అని ఆయన విపక్షాలను నిలదీశారు. బీఆర్ఎస్ ఓటమితో వైసీపీకి ఎందుకు ముడిపెడుతున్నారు? అని అడిగారు.

Also Read : ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాకు అసలు కారణాలు అవేనా..? ఏదైనా వ్యూహం ఉందా

జనసేన తెలంగాణలో పోటీ చేస్తే టీడీపీ ఎందుకు సపోర్ట్ చేయలేదు? అని పోసాని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో పొత్తు ఉన్నారు కదా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు జైల్లో ఉంటే పవన్ ధీమాగా టీడీపీకి సపోర్ట్ చేశారని గుర్తు చేశారాయన. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ ఎందుకు సపోర్ట్ చేసింది? అని ఆయన అడిగారు. ఈ విషయాన్ని కాపు సోదరులు గమనించగలరు అని చెప్పారు.

చంద్రబాబు కాపులని, పవన్ కల్యాణ్ ని ముంచుతాడు అని హెచ్చరించారు. ఏపీలో కూడా చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి పోటీ చేయొచ్చు కదా అని పోసాని అన్నారు. చంద్రబాబుకి కాపు ఓట్లు కావాలి. కానీ, అధికారం మాత్రం కాపులకి ఇవ్వరు అని మండిపడ్డారు. తెలంగాణలో జనసేన గెలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ సీట్లు అడుగుతాడనే.. తెలంగాణలో జనసేనకి చంద్రబాబు సపోర్ట్ చేయలేదన్నారు. చంద్రబాబుకి బుద్ధి ఉందా? గతంలో 23 ఎమ్మెల్యేలని ఎందుకు కొన్నావు? అంటూ నిప్పులు చెరిగారు. జగన్ కి ఎవరి సపోర్ట్ అవసరం లేదని, ప్రజలు అండగా ఉంటే చాలని పోసాని వ్యాఖ్యానించారు.

Also Read : ఏపీకి మరో తుఫాన్ గండం.. మిచాంగ్ బీభత్సం నుంచి కోలుకోకముందే!