వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు షాక్..!
మరియమ్మ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నందిగంకి మంగళగిరి కోర్టు.. రిమాండ్ విధించింది.

Nandigam Suresh (Photo Credit : Google)
Nandigam Suresh : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు బిగ్ షాక్ తగిలింది. హత్య కేసులో రిమాండ్ లో ఉన్న సురేశ్ బెయిల్ పిటిషన్ ను గుంటూరు జిల్లా కోర్టు కొట్టివేసింది. 2020లో జరిగిన మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేశ్ ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నందిగం సురేశ్ కి గతంలో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, మరియమ్మ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నందిగంకి మంగళగిరి కోర్టు.. రిమాండ్ విధించింది. దీనిపై సురేశ్ బెయిల్ కు దరఖాస్తు చేయగా.. పిటిషన్ ను కొట్టివేసింది న్యాయస్థానం.
టీడీపీ కార్యాలయంపై దాడి, మరియమ్మ అనే మహిళ హత్య కేసుల్లో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ నిందితుడిగా ఉన్నారు. సురేశ్ కు కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. 2020లో వెలగపూడిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో ఓ మరియమ్మ అనే మహిళ చనిపోయింది. దీంతో హత్య కేసు నమోదైంది. ఈ కేసులో ఈ నెల 21వరకు కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. ఇక, టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇటీవల ఆయనకు హైకోర్టులో షరతులతో కూడి మధ్యంతర బెయిల్ మంజూరైంది.
Also Read : వాళ్లు గుడిని మింగేస్తే మీరు లింగాన్ని మింగేస్తున్నారు- మద్యం టెండర్ల అంశంలో సీఎం చంద్రబాబుపై షర్మిల ఫైర్