Yarlagadda Venkat Rao : అన్నం తినే వారు ఎవరూ వైసీపీలో చేరరని అన్నారు- వల్లభనేని వంశీపై యార్లగడ్డ నిప్పులు

Yarlagadda Venkat Rao - Vallabhaneni Vamsi

Yarlagadda Venkat Rao : అన్నం తినే వారు ఎవరూ వైసీపీలో చేరరని అన్నారు- వల్లభనేని వంశీపై యార్లగడ్డ నిప్పులు

Yarlagadda Venkat Rao - Vallabhaneni Vamsi

Updated On : August 14, 2023 / 1:06 AM IST

Yarlagadda Venkat Rao – Vallabhaneni Vamsi : గన్నవరం రాజకీయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. గన్నవరం వైసీపీ టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. టికెట్ నాదే అంటే నాదే అంటూ గొడవ పడుతున్నారు. గన్నవరం గడ్డ నా అడ్డా, నేనే పోటీ చేస్తా, ఎవరు అడ్డు వస్తారో చూస్తా అంటున్నారు వైసీపీ నేతల యార్లగడ్డ వెంకట్రావ్. ఈ క్రమంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టార్గెట్ గా యార్లగడ్డ వెంకట్రావ్ మాటల తూటాలు పేల్చారు.

పొలిటికల్ ప్లాట్ ఫామ్ లో ఉన్నంత కాలం గన్నవరం గడ్డ తన అడ్డా అంటూ బల్లగుద్ది మరీ చెప్పారు. ఎవరేమన్నా 2024లో గన్నవరం నుంచి తాను పోటీ చేయడం ఖాయం అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పారు. సీఎం జగన్ తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పినా, కార్యకర్తలకు తాను ఎక్కడ దూరం అవుతానో అనే భయంతో ఎమ్మెల్సీ పదవి తనకు వద్దని చెప్పినట్లుగా యార్లగడ్డ వెల్లడించారు.

”దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికలకు ముందు నాపై అనేక కేసులు పెట్టారు. దురదృష్టవశాత్తు 270 ఓట్లతో మాత్రమే ఓడిపోయాను. వల్లభనేని వంశీతో కలిసి పని చేయాలని సీఎం సూచించినా నా వల్ల కాదని చెప్పాను. రాజకీయాల్లో ఉన్నంతకాలం గన్నవరంలో ఉంటానని చెప్పా. పోటీ ఖాయం. 2024లో గన్నవరం నుంచి పోటీ చేస్తా.

Also Read..Galla Family: గల్లా కుటుంబం తరుఫున ఎవరు పోటీ చేసినా ఓకే.. టిక్కెట్ ఇచ్చేందుకు రెడీ!

అన్నం తినే వారు ఎవరూ వైసీపీలో చేరరని వంశీ అన్నారు. వంశీతో కలిస్తే నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చేది. అయినా కలవలేదు. నాకు అన్యాయం చేయనని సీఎం జగన్ చెప్పారు. ఎవరికీ భయపడేది లేదు. ఎన్ని అవమానాలు ఎదురైనా సీఎంను ఒక్క మాట కూడా అనలేదు. రెండేళ్ల నుంచి సీఎంను కలుద్దామంటే అవకాశం ఇవ్వలేదు. నాకు టిక్కెట్ ఇవ్వాలని సీఎంను అభ్యర్దిస్తున్నా. టిక్కెట్ ఇవ్వకుంటే గన్నవరం ప్రజలు నా భవిష్యత్తును నిర్ణయిస్తారు. గన్నవరం టిక్కెట్ ఇవ్వాలని కార్యకర్తల సమక్షంలో సీఎం జగన్ ను అడుగుతున్నా. గన్నవరంలోనే పోటీ చేస్తా. ఇక్కడే రాజకీయం చేస్తా” అని తేల్చి చెప్పారు యార్లగడ్డ వెంకట్రావ్.

ఏపీ రాజకీయాల్లో గన్నవరం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ పై గెలిచిన వంశీ.. ఆ తర్వాత అధికార పార్టీ వైసీపీకి దగ్గరయ్యారు. దీంతో యార్లగడ్డ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు.. మళ్లీ గన్నవరంలోకి ఎంట్రీ ఇచ్చిన యార్లగడ్డ.. గవన్నరం నాదే, వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటున్నారు. దాంతో గన్నవరం వైసీపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది.