ఏపీలో బీహార్ తరహా హింసా రాజకీయాలు..!- గవర్నర్‌కు వైసీపీ నేతల ఫిర్యాదు

టీడీపీ చేసే హింసను ప్రజలకు తెలియజేస్తాం. వైసీపీ కార్యకర్తలను కాపాడుకోవడానికి మేము తిరుగుబాటు చెయ్యాల్సి వస్తుంది.

ఏపీలో బీహార్ తరహా హింసా రాజకీయాలు..!- గవర్నర్‌కు వైసీపీ నేతల ఫిర్యాదు

Perni Nani (Photo Credit : Google)

Updated On : June 6, 2024 / 6:52 PM IST

YCP : కౌంటింగ్ అయ్యాక ఏపీలో బీహార్ తరహా హింసా రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేత పేర్నినాని ఆరోపించారు. టీడీపీ గూండాలు వైసీపీ నేతల ఇళ్ళపై దాడులు చేస్తున్నారని చెప్పారు. హింస కోసమే అధికారంలోకి వచ్చినట్టు వారి ప్రవర్తన ఉందని మండిపడ్డారు. దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు.

వైసీపీ నేతలు రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. కౌంటింగ్ ముగిశాక వైసీపీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులపై దాడులు జరుగుతున్నాయని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీనపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయని, వెంటనే జోక్యం చేసుకోవాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు వైసీపీ నాయకులు. గవర్నర్ ను కలిసిన వారిలో వైవీ సుబ్బారెడ్డి, గురుమూర్తి, తనుజా, శివప్రసాద్, మత్యలింగం, విశ్వేశ్వర రాజు, పేర్ని నాని ఉన్నారు.

”జరుగుతున్న హింసకు సంబంధించిన వీడియోలు చూసి గవర్నర్ ఆశ్చర్యపోయారు. డీజీపీని పిలిపించి విచారణ చేస్తానని గవర్నర్ చెప్పారు. ఈ దాడులను సీరియస్ గా తీసుకుని చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ తరహా సంస్కృతి కొనసాగితే ఎళ్లకాలం టీడీపీనే అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి. కూటమి నేతల ఒత్తిడితో పోలీసులు చోద్యం చూస్తున్నారు.

ఈ దాడులను నిలువరించడానికి 26 జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేశారు జగన్. 26 జిల్లాలోని లీగల్ టీమ్ లు యాక్టివేట్ చేశారు. న్యాయ పోరాటం చేస్తాం. కార్యకర్తలకు, నేతలకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. ఎక్కడైనా దాడులు జరిగితే కమిటీ వాళ్ళకి అండగా ఉంటుంది. టీడీపీ చేసే హింసను ప్రజలకు తెలియజేస్తాం. వైసీపీ కార్యకర్తలకు కాపాడుకోవడానికి మేము తిరుగుబాటు చెయ్యాల్సి వస్తుంది” అని హెచ్చరించారు పేర్నినాని.

Also Read : పంటికి పన్ను కంటికి కన్ను: టీడీపీ దాడులపై గోరంట్ల మాధవ్ స్పందన