కుప్పంలో కుమ్ములాట : టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయం వేడుక్కుతోంది. పార్టీ నేతల నుంచి కార్యకర్తల వరకు ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు.

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయం వేడుక్కుతోంది. పార్టీ నేతల నుంచి కార్యకర్తల వరకు ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు.
చిత్తూరు : ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయం వేడుక్కుతోంది. పార్టీ నేతల నుంచి కార్యకర్తల వరకు ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. ఎన్నికల పోలింగ్ కు తక్కువ సమయం ఉండటంతో ఇప్పటికే అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష పార్టీ వైసీపీ జోరుగా ప్రచారాల్లో దూసుకుపోతున్నాయి. పార్టీ కార్యకర్తలు కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసుల ఎదుటే టీడీపీ,వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ ఘర్షణలో ఓ బైక్ ధ్వంసం చేయగా, పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడిన కార్యకర్తలను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.