పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం

కౌంటింగ్ కు సంబంధించి అన్ని రకాలుగా సిద్ధం అవ్వాలంటూ నేతలకు సూచనలు ఇవ్వనున్నారు.

పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం

Updated On : June 1, 2024 / 6:03 PM IST

Cm Jagan : తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం కానున్నారు. కౌంటింగ్ పై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వస్తుండటంతో దానిపై నేతలతో చర్చించే అవకాశం ఉంది. గత 15 రోజులుగా రాష్ట్రంలో జరిగిన పరిస్థితులపై సీఎం జగన్ సమీక్షించనున్నారు. కౌంటింగ్ కు సంబంధించి అన్ని రకాలుగా సిద్ధం అవ్వాలంటూ నేతలకు సూచనలు ఇవ్వనున్నారు.

లండన్ పర్యటన నుంచి తిరిగొచ్చిన సీఎం జగన్.. పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లి నివాసంలో సమావేశం పెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో పాటు కీలక నేతలు ఈ సమావేశానికి హాజరుకాబోతున్నారు. గడిచిన 15 రోజులకు సంబంధించి రివ్యూ చేయనున్నారు జగన్. అలాగే కౌంటింగ్ కు సంబంధించి ఏ విధంగా సమాయత్తం అవ్వాలి, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి? అన్నదానికి సంబంధించి సీఎం జగన్ నేతలతో చర్చించబోతున్నారు.

సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ కూడా రానుండటంతో, ఎగ్జిట్ పోల్స్ వచ్చాక వ్యూహం ఏ విధంగా ఉండాలి అనేదానికి సంబంధించి నేతలతో జగన్ చర్చించబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, కూటమి నేతల కామెంట్స్ పై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా కౌంటింగ్ కు సంబంధించి చర్చ జరగబోతోంది. ఇప్పటికే కౌంటింగ్ చీఫ్ ఏజెంట్లకు శిక్షణా తరగతులు కూడా నిర్వహించారు. వారికి దిశానిర్దేశం కూడా చేశారు. కౌంటింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అనేకసార్లు చీఫ్ ఏజెంట్లకు చెప్పారు.

Also Read : ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ.. గెలుపుపై వైసీపీ ధీమాకు కారణమేంటి? విజయంపై కూటమి కాన్ఫిడెన్స్ ఏంటి?