Today Horoscope : నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారములలో అభివృద్ధి..!
ఈ రోజు (2024, నవంబరు 11, సోమవారం) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..
శ్రీ క్రోధి నామ సంవత్సరము కార్తీక మాస శుద్ధ దశమి సా 6:06, శతభిషం : ఉ 9:40
మేషం : బంధుమిత్రులతో సహనం గా ప్రవర్తించాలి, అధిక వ్యయం తగ్గించుకోవాలి, మానసిక ఆందోళనలు తగ్గించుకోవాలి, అనవసరపు విషయముల మీద జాగ్రత్త వహించాలి, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, ఇండ్లు కొనుగోలు విషయంలో జాగ్రత్త అవసరం: ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
వృషభం : కొన్ని చికాకులు కలగడం, అనుకున్నవి కుదరకపోవడం, రుణ బాధలు పెరగడం, విదేశాలకు వెళ్లడం, ఉద్యోగంలో ప్రమోషన్లు, నూతన వ్యాపారంలో లాభములు, విలువైన ఆభరణములు కొనడం, దూర ప్రయాణములు చేయడం, ధన విషయంలో పొదుపు పాటించాలి, ఆరోగ్యము పట్ల శ్రద్ధ అవసరము, మానసిక ఆందోళనలు పెరుగుతాయి, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రముల దర్శనము కలుగుతుంది – శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
మిధునం : ధనవ్యయం, కోపము, ఆవేశము పెరగడం, తోందరపాటు నిర్ణయములు, బంధు మిత్రులతో అనుబంధం పెరగడం, ప్రయాణములలో నష్టము, సంతానము ద్వారా శుభవార్తలు, ఆదాయం పెరగడం, నూతన వస్త్రములు కొనడం: ఇష్ట దైవ ఆరాధన చేయడం వల్ల శుభం కలుగును
కర్కాటకం : అన్నింటా విజయం, విద్యార్థులకు అనుకూలము, ధనలాభము, ప్రమాదములు, గొడవలు రాకుండా కాపాడుకోవాలి, విలువైన ఆభరణములు కొనుగోలు చేస్తారు, విధ్యార్థులకు అనుకూలం, ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు: శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
సింహ : అనుకోని ప్రయాణములు, ధననష్టము, వృధా ప్రయాణం, ఉద్యోగ ప్రయత్నములు సఫలీకృతం కావడం, నూతన ఉద్యోగములు, నూతన వ్యాపారములు, మంచి ఆలోచనలు: గణపతి ఆరాధన చేయడం వల్ల శుభం కలుగుతుంది.
కన్యా : ఉద్యోగ భద్రత అవసరము, ప్రతి పనిలో విజయం సాధిస్తారు, అనవసరపు విషయముల వైపు వెళ్లకూడదు, వ్యాపారంలో మార్పులు, విదేశాలకు వెళ్లడం, స్త్రీ సుఖం, నూతన ఆలోచనలు, ప్రతి పనిలో విజయం సాధించడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు రావడం, కోర్టు సమస్యలు, పిత్రార్జితము కలసి రావడం – లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
తుల : అనుకోని సమస్యలు, సరియైన సమయంలో సరియైన నిర్ణయములు తీసుకోలేకపోవడం, వ్యాపారంలో ఇబ్బందులు, నూతన గృహనిర్మాణము, విలువైన ఆభరణములు కొనుగోలు చేయడం, కోర్టు సమస్యలు రావడం, ప్రయాణములో నష్టము, భాగస్వామ్యంలో తగాదలు, భార్యభర్తల మధ్య విరోదములు, విద్యార్థులకు అనుకూలము: దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
వృచ్చికం : సమస్యలు ఉత్పన్నం అవడం, అదికారులతో చిక్కులు, ఆవేశం, కోపం ఎక్కువ కావడం, అనాలోచిత నిర్ణయములు, గోడవలు, సమస్యలు, సరియైన నిర్ణయములు తీసుకోలేకపోవడం, అభిప్రాయ బేదములు, అధిక వ్యయం, ఉన్నత చదువుల గురించి ధనము ఖర్చు కావడము, సంతోషము, స్త్రీ సుఖము కలగడం, అనవసరపు విషయములలో తల దూర్చకూడదు: శ్రీ ఆంజేనేయ స్వామి ఆరాధన వలన శుభఫలిత ములు కలుగుతాయి.
ధనస్సు : ఆదాయం పెరగడం, నూతన వ్యాపారంలో ఆదాయం పెరగడం, వివాహాది శుభకార్యక్రమములలో పాల్గోనడం, సంతానము ద్వారా శుభవార్తలు, విదేశాలకు వెళ్లే అవకాశములు రావడము, ప్రయాణములలో ప్రముఖ వ్యక్తులతో పరిచయములు పెరగడం, విలువైన ఆభరణములు కొనడము, దుస్తులు, వాహనములు కొనడం, బంధుమిత్రులతో సహనంగా ప్రవర్తించాలి – గురుచరిత్ర పారాయణం చేసినచో ఉత్తమ ఫలితములు కలుగుతాయి.
మకరం : ఉద్యోగంలో ఇబ్బందులు, వ్యాపారంలో చికాకులు, ప్రయాణంలో ఆటంకములు, ఆకస్మిక ధనలాభము, బుణ బాధలు తగ్గటం, బ్యాంకు లోన్లు రావడం, శుభ కార్యనిర్వాహణ, తీర్థ యాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శన, వాహన సౌఖ్యం, ప్రతి పనిలో విజయం సాధించడం, విలువైన వస్తువులు కొనడం, గృహ మరమ్మత్తులు, భూ సంబంధ వ్యవహారములలో అనుకూలం, ఒప్పందాలు కుదుర్చుకోవడము – శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి ఆరాధన చేయడం వల్ల శుభఫలితములు కలుగుతాయి.
కుంభం : మనః శాంతి లేకపోవడం, ఋణబాధలు, ప్రయాణములో ఆటంకములు, తీర్థయాత్రలు, ధన విషయములో జాగ్రత్త అవసరము, కోర్టు తీర్పులు వాయిదా పడటం. గర్భిణులకు శుభవార్తలు, స్థానచలనం, బదిలీలు, ప్రమోషన్లలలో ఆలస్యంగా అనుకూలత, వ్యాపారస్థులకు మిశ్రమ ఫలితములు, శుభకార్యా చర్చలు వాయిదా పడటం : నాగదేవత ఆరాధన వలన సమస్యలు తొలగి పోతాయి.
మీనం : నూతన ఆలోచనలు, వృత్తి ఉద్యోగములో చికాకులు, పనులలో ఆలస్యము, దైవకార్య క్రమములు, లేని పోని అపోహలు, భాగస్వామ్య వ్యాపారులు కలసి రావడం, ఉన్నత చదువులు, దూర ప్రయాణములు, వివాహములలో పాల్గోనటం, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, అనారోగ్య కారణంగా అధికవ్యయం, అభివృది పదంలో ముందుకు వెళ్ళడం, నూతన ఆలోచనల ద్వారా ధనము సంపాదించడం – గణపతి దేవాలయ దర్శనము చేయడం వల్ల శుభఫలితములు కలుగుతాయి.
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956