Today Horoscope: నేటి రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి శ్రమకుతగ్గ గుర్తింపు..!

ఈ రోజు (2024, నవంబరు 14, గురువారం) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...

Today Horoscope: నేటి రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి శ్రమకుతగ్గ గుర్తింపు..!

Astrological Prediction

Updated On : November 13, 2024 / 8:07 PM IST

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

శ్రీ క్రోది నామ సంవత్సర కార్తీక మాస శుద్ధ త్రయోదశి ఉ. 9.43, అశ్వని రా.12:23 గురువారము

మేష రాశి: శ్రమకు తగిన గుర్తింపు, కొత్త వారితో పరిచయములు కలుగుతాయి, మత కార్యక్రమములు సఫలీకృతమవుతాయి, విధ్యార్థులకు మంచి ఫలితములు, ఉద్యోగులకు పని ఒత్తిడి కలగడం, ఆర్థికంగా బాగుంటుంది, వ్యాపారులకు లాభములు, చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి, మునసిక ప్రశాంతత కలుగుతుంది, వివాదములు, శ్రీ అంగారక స్తోత్రపారాయణము చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

వృషభ రాశి: గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అకస్మిక ధనలాభము, బంధువుల నుంచి శుభసమాచారము, రాజకీయ నాయకులకు అనుకులంగా ఉంటుంది, ఆస్తివివాదములు తీరుతాయి. భూములు, వాహనములు కొనుగోలు చేయడం, భాగస్వాములతో వివాదములు పరిష్కారము కావడం. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. క్రీడాకారులకు శుభ ఫలితములు కలుగుతాయి. నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వల్ల ఉత్తమ ఫలితములు వస్తాయి.

మిధున రాశి: కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. ఆలోచనలు కలసివస్తాయి. స్థిరాస్తి అగ్రిమెంటు, ఇంటి నిర్మాణ ప్రయత్నములు కలసివస్తాయి. సమస్యలు తీరుతాయి, వ్యాపారములు లాభసాటిగా ఉంటాయి. ముఖ్యమైన పనులు నిర్వహించి గుర్తింపు పొందుతారు, రావలసిన సొమ్ము అందుతుంది. పారిశ్రామిక వేత్తలకు, రాజకీయ నాయకులకు తగిన గుర్తింపు లభిస్తుంది. సోదరులతో వివాదములు తగ్గుతాయి. రావి చెట్టు ప్రదక్షిణలు చేయడం వల్ల శుభఫలితములు కలుగుతాయి

కర్కాటక రాశి: వ్యాపారంలో ఆటంకములు, బాధ్యతలు భారం అవుతాయి. విద్యార్థులకు ప్రతికూల ఫలితములు. వ్యాపార కార్యకలాపాల్లో అంతరాయములు. ఉద్యోగులకు పనిభారము పెరగడం. వివాదములు పెరగడం, పనులు వాయిదా వేయవలసి వస్తుంది. ప్రయాణములలో లాభమలు, రుణబాధలు. శ్రీ కనకధారాస్తోత్ర పారాయణము చేయడం వల్ల శుభం కలుగుతుంది.

సింహ రాశి: కుటుంబ వివాదములు పరిష్కారము కవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు, వ్యాపారములలో లాభములు, కళా కారులు, క్రీడాకారులకు లాభములు. కుటుంబ వివాదములు పరిష్కారం అవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేయడం. ఇష్ట దైవ ఆరాధ్య వలన శుభం కలగుతుంది.

కన్యా రాశి: ప్రయాణములలో లాభములు, అనుకోని విధంగా అన్నీ కలసివస్తాయి. పనులు పూర్తి అవుతాయి, ఆదాయం పెరగడం, వృత్తి ఉద్యోగములలో లాభములు, ఆర్థికపరమైన ఇబ్బందులు తీరుతాయి, అకస్మిక ధనలాభములు, వాహన సుఖము, సరియైన నిర్ణయములు తీసుకోవడం, మంచి ఆలోచనలు అన్నదమ్ముల మధ్య అనుబంధము పెరగడం, కోర్టు సమస్యలు పరిష్కారమకావడం. గణపతి ఆరాధన వలన శుభం జరుగుతుంది.

తులా రాశి: పుణ్యములు చేయడం, గౌరవసన్మానములు, వధూవరులకు సంబంధములు కుదరడం, వృత్తి, ఉద్యోగములలో లాభములు, కార్య అనుకూలత, ధనసమృద్ధి, విద్యార్థులకు అనుకూలం, ఉన్నతమైన అభిప్రాయములు పెరగడం. అమ్మవారి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

వృశ్చిక రాశి: ధనవిషయంలో జాగ్రత్త అవసరము, వాత సంబంధ వ్యాధులు, భయము, బలహీనత, అనారోగ్యము, శుభకార్యక్రమములు చేయడం, సరియైన నిర్ణయములు తీసుకోవడం, వ్యాపారంలో చికాకులు, ఉద్యోగంలో అధికారుల ఆగ్రహములకు గురి కావడం. గణపతి ఆరాధన చేయడం వల్ల శుభఫలితములు కలుగుతాయి.

ధనస్సు రాశి: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం, ధనలాభము. వృత్తివ్యాపార రంగములలో అభివృద్ధి, రుణ బాధలు తగ్గడం, మంచి ఆలోచనలు కలగడం, నూతన వ్యాపారములు, ప్రయాణముల వలన లాభములు, శుభకార్య నిర్వాహణ, అగ్నిమెంట్లు ఫలిస్తాయి. అనుకోని ప్రయాణములు. స్త్రీలతో గొడవలు, కొద్ది వివాదములు. గకార అష్టోత్తరముతో గణపతి ఆరాధన చేసినచో శుభఫలితములు కలుగుతాయి.

మకరం: అనవసరపు విషయములలో జ్యోక్యం పనికిరాదు. ఆవేశం తగ్గించు కోవాలి. ప్రతి విషయంలో రాజీ అవసరము, ఆర్థిక లాభములు, గృహనిర్మాణము, గృహమరమ్మతులు, శుభకార్యములు. ప్రయాణములలో జాగ్రత్త అవసరము, వృత్తి వ్యాపారములలో
అభివృద్ధి కలుగును, చికాకులు, బంధుమిత్రులతో సహనంగా ఉండాలి. ఇష్ట దైవ ఆరాధన చేసినచో ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

కుంభ రాశి: నరాల బలహీనత, మానసిక ప్రశాంత లేకపోవడం, సరియైన సమయంలో నిర్ణయము తీసుకోలేకపోవడం, ధననష్టము, అకారణ వైరము, అనారోగ్యము గురించి ధనము ఖర్చుకోవడం, విరోధములు, కోర్టు సమస్యలు, వ్యాపారములో చికాకులు, ఊహించని నష్టములు, సోమరితనము అధికం కావడం, ప్రయాణముల్లో ప్రమాదములు – శ్రీవిష్ణు స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితములు
కలుగుతాయి.

మీన రాశి: నూతన విషయములలో అభివృద్ధి, కీలక అంశములపై చర్చలు, ప్రతి పనిని సమర్థవంతంగా నిర్వహించటం, ధనధాన్యలాభములు, అన్య స్త్రీ పరిచయము, కీర్తి ప్రతిష్టలు కలగడం, గౌరవ సన్మానములు పొందడం, నగలు, విలువైన వస్త్రములు కోనుగోలు చేయడం, అభివృద్ధి కలగడం. అమ్మవారి ఆరాధన వలన శుభం కలుగును.

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956