Today Horoscope: నేటి రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ధనలాభములు..!

ఈ రోజు (2024, నవంబరు 9, శనివారం) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...

Today Horoscope: నేటి రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ధనలాభములు..!

Updated On : February 20, 2025 / 2:26 PM IST

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

శ్రీ క్రోధి నామ సంవత్సరం కార్తీక మాసం శుక్ల అష్టమి: రా :10 : శ్రవణం : మ 11:47

మేష రాశి: అనుకోని ప్రయాణములు, ధనలాభములు, వ్యాపారంలో విభేదములు, కోర్టు సమస్యలు, చికాకులు, ఆరోగ్యము కుదుట పడుతుంది, స్త్రీలతో గొడవలు, విమర్శలు, న్యాయనిపుణులను సంప్రదిస్తారు, వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు కలుగుతాయి, దత్తాత్రేయ పారాయణము చేయటం వల్ల శుభం కలుగుతుంది.

వృషభ రాశి: ప్రయాణములలో ప్రమాదములు, ఆకస్మిక ధనలాభము, శుభకార్యనిర్వాహణ, వాగ్దానములు నెరవేరటం, ఆర్ధిక నష్టాన్ని పూడ్చుకుంటారు, అగ్రిమెట్లు ఫలిస్తాయి, స్థిర ఆదాయం తగ్గుతుంది, అవివాహితులకు శుభవార్తలు: విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభం కలుగును.

మిధున రాశి: స్థాన భ్రంశము, కార్యరంగంలో ప్రతికూలత, శత్రువృద్ధి, కుటుంబంలో సమస్యలు, అధిక ఆదాయం, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగములలో అభివృద్ధి. అన్నింటా విజయం, మంచి నిర్ణయములు తీసుకోవడం, అధికారుల ఒత్తిడి, కోర్టు వివాదములు, నిరాశ కలుగుతుంది: శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన వలన శుభ ఫలితములు కలుగుతాయి.

కర్కాటక రాశి: కోపం పెరగడం, అవసరాలు తీరడం, ఉన్న విషయములలో జుగ్రత్త అవసరము, రుణ బాధలు తగ్గడం, బంధుమిత్రులతో జాగ్రత్త అవసరము, వృత్తి వ్యాపార రంగములలో మంచినిర్ణయములు తీసుకుంటారు, మంచి మిత్రులతో కలయిక. విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

సింహ రాశి: ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, వివాహ విషయంలో ఆటంకములు, సరియైన నిర్ణయము లేకపోవడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, సర్దుబాటుతత్వం అలవర్చుకోవాలి, అనవసరపు ఆలోచనలు చేయకూడదు, ప్రయాణంలో ఇబ్బందులు – ఇష్టదైవ ఆరాధన చేసినచో శుభ ఫలితములు వస్తాయి.

కన్యా రాశి: ప్రతిపనిలో విజయం, మానసిక ఆందోళనలు కలగకుండా చూసుకోవాలి. శారీరక సుఖం, కార్యసిద్ధి, శుభకార్యక్రమములో పాల్గొనుట. వ్యాపారాభివృద్ధి, సుఖం, స్థిరాస్తులలో లాభం, ధనాదాయం, గౌరవ మర్యాదలు, కుటుంబంలో శుభకార్యములు. “ఓం నమో నారాయణాయ నమః” అష్టాక్షరి మంత్రము చదివినచో శుభం కలుగును

తులా రాశి: పుణ్యములు చేయడం, గౌరవసన్మానములు, గృహములో శుభకార్యక్రమములు చేయడం, యువతకు సంబంధములు కుదరడం, వృత్తి, ఉద్యోగములలో లాభములు, కార్య సానుకూలత, ధన సమృద్ధి, విద్యార్థులకు అనుకూలం, ఉన్నతమైన అభిప్రాయములు పెరగడం. అమ్మవారి ఆరాధన చేయడం వల్ల శుభఫలితములు కలుగుతాయి.

వృశ్చిక రాశి: ధన విషయంలో జాగ్రత్త అవసరము. వాత సంబంధ వ్యాధులు, భయము, బలహీనత, అనారోగ్యము, శుభకార్యక్రమములు చేయడం, సరైన నిర్ణయములు తీసుకోవడం, వ్యాపారంలో చికాకులు, ఉద్యోగంలో అధికారుల ఆగ్రహములకు గురి కావడం, గణపతి ఆరాధన చేయడం వల్ల శుభఫలితములు కలుగుతాయి.

ధనస్సు రాశి: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం, అభివృద్ధి, ధనలాభము, వృత్తి వ్యాపార రంగములలో రుణబాధలు తగ్గడం, మంచి ఆలోచనలు కలగడం, నూతన వ్యాపారములు ప్రయుణముల వలన లాభములు, శుభకార్య నిర్వాహణ, అనుకోని ప్రయాణములు, స్త్రీలతో గొడవలు, కొద్ది వివాదములు. గకార అష్టోత్తరముతో గణపతి ఆరాధన చేసినచో శుభఫలితములు కలుగుతాయి.

మకర రాశి: అనవసరపు విషయములలో జోక్యం పనికిరాదు. ఆవేశం తగ్గించుకోవాలి, ప్రతివిషయంలో రాజీ అవసరము, గృహ నిర్మాణము, గృహ మరమ్మత్తులు, శుభకార్యాలు, ఆర్థిక లాభములు, ప్రయాణములలో జాగ్రత్త అవసరము. వృత్తి వ్యాపారములలో
చికాకులు, బంధుమిత్రులతో సహనంగా ఉండాలి, ఇష్టదైవ ఆరాధన చేసినచో ఫలితములు కలుగుతాయి.

కుంభ రాశి: మనః శాంతి కలగడం, అధిక ప్రయాణములు, తీర్థ యాత్రలు, అకస్మిక ధనలాభము, ఆకస్మిక ప్రయాణములు, ఉదర సంబంధ వ్యాధులు, ఉద్యోగ భద్రత అవసరము, శ్రమకు గుర్తింపు, అనేక మార్గములలో ఆదాయం, పెండింగ్ పనులు అన్నీ వేగంగా పూర్తి అవుతాయి. నూతన ఆభరణములు కొనుగోలు చేయడం, రాజకీయవ్యవహారములో జయము. శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఫలితములు కలుగుతాయి.

మీన రాశి: ధననష్టం, వృథా ప్రయాణములు, చికాకులు, అలసట, వస్తువుల కొనుగోలు. స్త్రీలకు నూతన అవకాశములు, స్థిరాస్తి పెరగడం, ధనధాన్య సమృద్ధి కలగడం, విద్యార్థులకు అనుకూలము. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితములు పొందుతారు.

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956