Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఆర్థిక పరంగా అనుకూలం..!
ఈ రోజు (ఆదివారం, నవంబర్ 3, 2024) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...

Horoscope
జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..
శ్రీ క్రోధి నామ సంవత్సర కార్తీక శుద్ధ విదియ రాత్రి 10.05, అనురాధ ఆదివారం ఈరోజు పూర్తిగా ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు
మేష రాశి : అనుకున్న పనులు నెరవేరుతాయి. అన్ని పనుల్లో విజయం, ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. ప్రయాణాలు చేయడం, చికాకులు తగ్గుతాయి. వ్యాపార రంగంలో అభివృద్ధి కలుగుతుంది, విద్యార్థులకు బాగుంటుంది. శుభ కార్యక్రమాలు నిర్వహించుట, నూతన వ్యాపారాల్లో విజయం సాధించడం జరుగుతుంది (విశ్వనాథాష్టకం చదవవలెను శుభం కలుగుతుంది.)
వృషభ రాశి : సంతాన సమస్యలు, బంధుమిత్రులతో సహనముగా ఉండాలి. విరోధములు పెట్టుకోకూడదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. బుణబాధలు తగ్గుతాయి. మనఃశాంతి లేకపోవడం. అనవసరపు విషయములవైపు వెళ్లకూడదు, ధనము విషయంలో జాగ్రత్త అవసరం. (ఆంజనేయ స్వామి ఆరాధన చేసినచో ఉత్తమ ఫలితములు కలుగుతాయి)
మిథున రాశి : అజీర్ణ వ్యాధులు, అనారోగ్యము, నిద్రలేమి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రమాదములు, వివాదములు, చికాకులు ఉంటాయి. జాయింట్ వ్యాపారములు కలిసి వస్తాయి. నూతన వస్తువులు కొనడం, ధనలాభం కలుగుతుంది. సరియైన నిర్ణయాలు తీసుకోవాలి. (గోవును పూజించవలెను. శుభం కలుగుతుంది)
కర్కాటక రాశి : ఆనందం, గౌరవాభివృద్ధి కలుగుతుంది. సమస్త భోగభాగ్యములు కలుగుతాయి. ఆదాయం కలిసి రావడం. ప్రయాణముల వలన లాభము, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. (గణపతి ఆరాధన చేయవలెను మంచి జరుగుతుంది)
సింహ రాశి : అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ధీర్ఘకాలిక రోగముల ద్వారా బాధలు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు ఎదురవుతాయి. అర్ధంపర్థం లేని విషయాలతో గొడవలు జరుగుతాయి. కోర్టు సమస్యలు, ప్రయాణములతో బాధలు కలుగుతాయి. అనాలోచిత చర్యలకు దూరంగా ఉండాలి. (శ్రీలక్ష్మీ నరసింహ స్తోత్రం పోరాయణం చేయవలెను. శుభం కలుగును)
కన్యా రాశి : మంచి విషయాలు తెలుసుకుంటారు. క్రీడల యందు ఆసక్తి కలుగుతుంది. రుణములు లభిస్తాయి. మంచి శుభవార్తలు వింటారు. శరీరంలో రుగ్మతలతో ఇబ్బందులు కలుగుతాయి. వస్త్రములు కొనుగోలు చేస్తారు. ప్రత్యేక విషయాల మీద దృష్టి పెట్టాలి. (కార్తికేయ స్తోత్రం పారాయణం చేయవలెను)
తులా రాశి : ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. కుటుంబంలో వివాదములు రాకుండా చూసుకోవాలి. పొదుపు పాటించాలి. మితభాసిగా ఉండాలి. నిర్ణయముల్లో జాగ్రత్త వహించాలి. మోసములకు గురికాకుండా ఉండాలి. వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసిక బాధలు వెంటాడుతు ఉంటాయి. స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. ( సుందరకాండ పారాయణము చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి)
వృశ్చిక రాశి : వృత్తి ఉద్యోగములలో అనుకూలము. ధన లాభం కలుగుతుంది. నూతన వ్యాపారములు, పెట్టుబడిదారులు రావడం. ఆరోగ్యం కుదుటపడుతుంది. శుభవార్తలు వింటారు. విద్యార్థులకు అనుకూలం. (గణపతి పంచరత్న స్తోత్ర పారాయణం చేసినచో శుభం జరుగుతుంది.)
ధనస్సు రాశి : ప్రతి విషయము జాగ్రత్తగా ఆలోచించాలి. ధనలాభము కలుగుతుంది. మానసిక స్థితి విషయంలో జాగ్రత్త అవసరం. ధనము విషయంలో కలిసి రావడం జరుగుతుంది. స్నేహితుల ద్వారా లాభములు, చిరు వ్యాపారములు వారికి లాభము, స్థానచలనము కలుగుతాయి. (ఈశ్వర ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితములు వస్తాయి)
మకర రాశి : కుటుంబంలో ఆనందం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణ బాధలు తగ్గుతాయి. ధన వృద్ధి విషయంలో అభివృద్ధి కలుగుతుంది. పుణ్యక్షేత్రములు, బంధుమిత్రులతో విందులు, వినోదములు అభివృద్ధి కలుగును. నూతన ఆలోచనలు చేస్తారు. (దుర్గా ఆరాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి)
కుంభ రాశి : అనవసరపు మాటలతో సమస్యల వస్తాయి. ఇతరుల వలన గొడవలు. బద్దకం వీడాలి, లౌకికంగా ఉండాలి. మధ్య వర్తిత్వం పనికిరాదు. (ఇష్టదైవ ఆరాధన వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి)
మీనా రాశి: శభవార్తలు వింటారు. మంచి ఆలోచనలు చేయాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ద అవసరం. లాభదాయకమైన ప్రయాణములు చేయాలి. బాధ్యతలు పెరుగుతాయి. విలువైన ఆస్తులు సంపాదించడం, స్థాన చనలం, మానసిక వేదనలు ఉంటాయి. (శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన వలన మంచి ఫలితములు కలుగుతాయి)
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956