Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి సకలకార్యసిద్ధి..!
ఈ రోజు (సోమవారం, నవంబరు 4, 2024న) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాలు వివరాలు...

Astrological Prediction
జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..
ఈ క్రోది నామ సంవత్సర కార్తీక శుద్ధ తదియ రా: 11:24, అనురాధ: ఉ 8:04, సోమవారము
మేష రాశి: అన్నింటా అభివృద్ధి, సకలకార్యసిద్ధి, స్త్రీ సుఖం, శారీరక సౌఖ్యం, మనఃశాంతి, మానసికానందం, వ్యాపార, ఉద్యోగాల్లో లాభం. (గణపతి అష్టోత్తరము పఠించాలి)
వృషభ రాశి: గృహమందు శుభకార్యనిర్వహణ, స్వస్థల నివాస ప్రాప్తి, కీర్తి, ఆరోగ్యం, స్త్రీ సుఖము, ప్రయాణముల్లో లాభములు, ధన లాభములు, పరోపకారము. (శివ ఆరాధన చేయాలి)
మిధున రాశి: మానసిక ఆందోళనలు, బలహీనత, భయము, వాతసంబంధ సమస్యలు, అనారోగ్యము, ప్రయాణములో జాగ్రత్త, ధననష్టం నిరాశ, నిసృహ, శ్రమకు గుర్తింపులేకపోవడం. (విష్ణు సహస్త్ర నామ పారాయణము చేయాలి)
కర్కాటక రాశి: బంధుమిత్ర వైరము, ఆందోళనలు, ప్రయాణాల వలన లాభం, వ్యాపారంలో లాభములు, అదనపు ఆదాయం, పుణ్యక్షేత్ర దర్శన, విదేశీయానములో ముందంజ. (లలితా అమ్మవారి ఆరోధన వలన ఉత్తమ ఫలితము కలుగుతాయి)
సింహ రాశి: నూతనవస్త్రలాభం, విలువైన ఆభరముల కొనుగోలు, కార్యములయందు విజయం విధ్యార్థులకు అనుకూలం, స్త్రీలకు ఉన్నత భావములు, శుభకార్యములు, ప్రముఖ వ్యక్తుల కలయిక. (శివస్తోత్ర పారాయణము వలన మంచి ఫలితము వస్తాయి)
కన్యా రాశి: నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి, కుటుంబ సుఖము, ఆరోగ్యము, సమాజంలో గౌరవము, సుఖ నిద్ర, భోజన సుఖము, నూతన ఆలోచన, మృష్టాన్న భోజనము, నూతన ఉద్యోగ వ్యాపారములు. (కనకధార స్తోత్ర పారాయణము వలన ఉత్తమమైన ఫలితము కలుగు తాయి)
తులా రాశి: శరీర సౌఖ్యము, సంతోషం, ఉద్యోగ ప్రాప్తి, ఉత్సాహం, అభివృద్ధి, సన్మానం, నగలు, విలువైన వస్త్రములు కొనుగోలు చేయుట, వృత్తి విషయంలో అభివృద్ధి కలుగుతుంది. (దుర్గాదేవి ఆరాధన వలన శుభ ఫలితములు)
వృశ్చిక రాశి: అగౌరవం, ఉద్యోగంలో ఇబ్బందుల వ్యాపారములో చికాకులు, నిరాశ, శరీరశ్రమ, ఆపదలు సంభవించండం, వివాహ ప్రయత్నములలో ఆలస్యము, సంతానలాభము, భయము. (ఆంజనేయ స్వామి ఆరాధనవలన శుభం కలుగుతుంది)
ధనస్సు రాశి: నిరుద్యోగలకు ఉద్యోగం, విదేశీ ప్రయత్నములు అనుకూలము, శుభవార్తలు, వివాహ ప్రయత్నములలో అనుకూలము, కోర్టు సమస్యలు పరిష్కారము కావడం, నూతన వ్యాపారములు. (ఇష్టదైవ ఆరాధన వలన ఉత్తమ ఫలితములు కలుగుతాయి)
మకర రాశి: కార్యవిజయం, ఆరోగ్యము, బంధుప్రీతి, ఇష్ట కార్యసిద్ధి, శుభకార్య నిర్వహణ, సుఖసంతోషములు, చేపట్టిన ప్రతి పనిలో సానుకూలత, అధికారుల అనుగ్రహం, ప్రయాణముల వలన లాభము కల్గును, సుఖము. (గకార అష్టోత్తరముతో గణపతి పూజతో శుభం)
కుంభ రాశి: దేశసంచారం, సంతానంతో విరోధం, ఉద్యోగ విషయంలో జాగ్రత్త, అనారోగ్యం సంతానంతో విరోధం, వ్యాపారంలో చికాకులు జాయింటు దారులతో ఇబ్బందులు. (శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన వల్ల శుభ ఫలితములు కలుగుతాయి)
మీన రాశి: అకాల భోజనం, అనారోగ్యం, మోకాళ్ల నొప్పులు, అజీర్ బాధలు, నిద్రలేమి, ఉద్యోగ వ్యాపారంలో ఒత్తిడి, ప్రయాణములో ఆటంకములు, ధన నష్టం, వృథా ప్రయాణము. (సూర్య నమస్కారములు చేయడం వల్ల శుభం జరుగుతుంది)
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956