Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆకస్మిక ధనలాభం..!
ఈ రోజు (మంగళవారం, 19 నవంబర్ 2024) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశులa ఫలితాల వివరాలు...

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..
శ్రీ క్రోధి నామ సంవత్సర కార్తీకమాస బహుళ చవితి : సా 5 : 28, మంగళవారము ఆర్ద్ర : మ 2:56 ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు
మేష రాశి: ఈ రోజు సామాన్యంగా ఉంటుంది, ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది, మిత్రులతో మట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది, ఆర్థిక అంశాల పట్ల స్పష్టమైన విధానంతో ఉంటే మంచిది, కొత్త పనులేమి మొదలు పెట్టవద్దు, నూతన వస్త్రాభరణములు కొనుగోలు చేస్తారు, ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది, ఆరోగ్యం బాగుంటుంది. ఈశ్వరుని ఆలయ సందర్శన శుభకరం.
వృషభ రాశి: ఈ రోజు శుభకరంగా ఉంటుంది, అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారంలో ఈ రోజు అద్భుతంగా ఉంటుంది, నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు, చర్చలు సఫలీకృతం అవుతాయి, కుటుంబ సభ్యుల సహాకారంతో పెద్దల ఆస్తి కలసివస్తుంది, సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు, స్నేహితులతో విహార యాత్రలకు వెళ్లడం, వృత్తిపరమైన అభివృద్ధి, పదోన్నతి ద్వారా ఆదాయం వృద్ధి చెందుతుంది. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శించటం వలన శుభ ఫలితములు కలుగుతాయి.
మిధున రాశి: ఈ రోజు అనుకూలంగా ఉంటుంది, వ్యాపార వేత్తలు, వృత్తి నిపుణులు తమతమ రంగాలలో మెరుగైన పురోగతిని సాధిస్తారు, ఆర్థిక, కుటుంబ వ్యవహారాలు, వృత్తిపరమైన జీవితంలో అంతటా ఆనందమే నెలకొంటుంది, ఆకస్మిక ధనలాభము, బుద్ధి బలంతో ఈ రోజు అన్ని పనులు పూర్తి అవుతాయి, అన్ని రంగములలో పురోగాభివృద్ధి సాధిస్తారు. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం మేలు చేస్తుంది.
కర్కాటక రాశి: ఈరోజు సామాన్యంగా ఉంటుంది, వృత్తి వ్యాపారములలో శ్రమకు తగిన ఫలితములు వస్తాయి, సామాజికంగా మీ కీర్తి ప్రతిష్ఠలు, గౌరవం పెరుగుతాయి, ఆస్తివ్యవహారాల్లో జాగ్రత్తవహించండి, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు, వాహన ప్రమాదములు జరిగే అవకాశం ఉంది, రుణభారము నుంచి విముక్తి చెందుతారు, వృత్తిపరంగా పొందిన విజయాల కారణంగా సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. శ్రీ గణపతి అష్టోత్తరంతో పూజ చేయడం వల్ల శుభం జరుగుతుంది.
సింహ రాశి: ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది, వృత్తిపరంగా గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విముకి లభిస్తుంది, సామాజికంగా సమస్యలు తొలగిపోతాయి, వ్యాపారులకు రుణ భారం, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, అవసరానికి ధనం చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దృఢపడుతాయి, ప్రయాణములు చేయడం. శివాలయ సందర్శన చేయటం వల్ల శుభం కలుగుతుంది.
కన్యా రాశి: ఈ రోజు శుభకరంగా ఉంటుంది, సామాజింకంగా కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి, గౌరవం పెరుగుతాయి, కోపం, ఆవేశం పెరుగుతుంది, అవసరానికి ధనం చేతికి అందుతుంది, కుటుంబంలో ప్రశాంత వాతావారణం ఉంటుంది, చేసే ప్రతిపనిలో విజయం వెన్నంటే ఉంటుంది, ఆరోగ్యం సహకరిస్తుంది, కీలక నిర్ణయములు తీసుకుంటారు, మాతృవర్గం నుంచి అందిన శుభవార్తలు మీ ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదభరితం చేస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల శుభం జరుగును.
తులా రాశి: ఆర్థిక పరంగా లాభములు పొందడం, మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు ఆనందంగా ఉంటారు, కష్టపడి పనిచేస్తారు, ప్రశంసలు అందుకుంటారు, దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది జాగ్రత్త వహించండి, ప్రశాంతమైన వాతావరణాని కల్పించుకోవాలి, మంచి ఫలితముల కోసం ఏకాగ్రత అలవర్చుకోవాలి, నూతన వ్యాపారములలో లాభములు. విష్ణు సహస్రనామస్తోత్ర పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.
వృశ్చిక రాశి: ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి, కుటుంబసభ్యుల మద్ధతు అవసరము, ముఖ్యమైన నిర్ణయములు తీసుకొనే ముందు సలహాలు తీసుకోవాలి, ప్రేమలో నిరాశకు గురికావద్దు, పొదుపు పాటించాలి, వ్యాపారంలో మద్దతు లభిస్తుంది, కోర్టు సమస్యలు వస్తాయి. ఇష్ట దైవ ఆరాధన వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
ధనస్సు రాశి: ఈ రోజు మిశ్రమ ఫలితములు ఉంటాయి, వ్యాపారములలో ఊహించని సమస్యలు, కుటుంబంలో ఆనందకర సంఘటనలు జరుగుతాయి, శుభకార్యములు జరుగుతాయి, ఆరోగ్య పరంగా చిన్నచిన్న ఇబ్బందులు, మిత్రులతో బంధువులతో సహనంగా ఉండాలి, విధ్యార్థులకు అనుకూలము, అమ్మ వారి ఆలయ సందర్శన చేయడం వల్ల శుభం జరుగును.
మకర రాశి: ఈ రోజు శుభకరంగా ఉంటుంది, బాల్య మిత్రులని కలుసుకుని సరదాగా గడుపుతారు, ఆరోగ్యం కుదుటపడుతుంది, ఆస్తి వ్యవహారములలో కలసివచ్చే అవకాశము, స్థిరమైన బుద్ధితో ప్రశాంతమైన మనసుతో పనిచేసి మీ ఖ్యాతి తగ్గకుండా చూసుకోండి, ఆర్థిక లాభములు, అకస్మిక ధనలాభంలు కలుగుతాయి. ఇష్ట దేవత ఆరాధన వలన ఉత్తమ ఫలితములు కలుగుతాయి.
కుంభ రాశి: వృత్తి ఉద్యోగపరంగా చిన్న చిన్న సమస్యలు మినహా శుభంగా ఉంటుంది, ఈ రోజు మానసిక ఆందోళనలు, అధికారుల ఒత్తిడి కలగడం, భాగస్వామ్య వ్యాపారంలో సమస్యలు, ధనలాభం, కోర్టు సమస్యల్లో పరిష్కరములు కనబడటం, తీర్థయాత్రలు, ప్రయాణముల వలన లాభములు, అన్నింటా విజయ సూచనలు, శుభకార్యక్రమములలో పాల్గొనడం సంతోషం శాంతి కలుగుతుంది. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శన ఉత్తమము.
మీన రాశి: ఈ రోజు విశేషంగా యోగిస్తుంది, వ్యాపారము-ఉద్యోగములలో ఆర్ధిక లాభములు, అన్ని రంగాల వారికి ఈ రోజు లక్ష్మీ కటాక్షంతో ఆర్ధికలాభములు, పనిలో విజయ పరంపరలుగా ఉంటాయి, ఆరోగ్యం సహకరిస్తుంది, ఈ రోజంతా ప్రశాంతంగా గడిచి పోతుంది, ఆకస్మిక ధనలాభము కలుగుతుంది, సహనంతో ఉంటే అన్ని శుభములు జరుగుతాయి. శ్రీ కనకధార స్తోత్రము పారాయణము చేయటం వల్ల శుభం కలుగుతుంది.
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956