Karthika Masam: కార్తీక మాసం.. 22వ రోజు.. నవంబర్ 12.. ఇలా చేస్తే శత్రు బాధలు, దిష్టి దోషాలు దూరం..!
అలాగే.. శివుడిని ప్రత్యేకమైన పుష్పాలు, పత్రాలతో పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి.
Karthika Masam: కార్తీక మాసం.. 22వ రోజు.. నవంబర్ 12.. బుధవారం.. ఎలాంటి విధివిధానాలు పాటిస్తే శత్రు బాధలు, దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకుని ఆర్థికంగా పురోభివృద్ధి సాధించవచ్చో తెలుసుకుందాం. కార్తీక మాసంలో 22వ రోజు అష్టమితో కలిసి వచ్చింది కాబట్టి.. దీన్ని బుధాష్టమి అని పిలుస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన దీపాలు వెలగించుకోవడం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.
నవంబర్ 12న అందరూ చేయాల్సిన పని.. గురువులకు పాదపూజ చేయాలి. చదువు చెప్పిన గురువు లేదా విజ్ఞానం అందించిన గురువు.. కాళ్లను నీళ్లతో కడిగి, ఆ నీళ్లను తల మీద చల్లుకోవాలి. కార్తీక మాసం 22వ రోజున ఇలా గురువు పాద పూజ చేస్తే జాతకంలో గురుబలం పెరుగుతుంది. గురు గ్రహ దోషాలు తొలగింపజేసుకోవచ్చు.
అలాగే.. శివుడిని ప్రత్యేకమైన పుష్పాలు, పత్రాలతో పూజిస్తే పలు ప్రయోజనాలు కలుగుతాయి. 22వ రోజున శివుడిని గరికపోచలతో పూజిస్తే తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మేధాశక్తి పెరుగుతుంది. ఉమ్మెత్త పూలతో శివుడిని పూజిస్తే ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా ప్రశాంతత వస్తుంది. ఎప్పుడూ ఒత్తిడిలో ఉండే వాళ్లు ప్రత్యేకించి సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, వర్క్ ప్రెజర్ ఉన్న వాళ్లు కార్తీక మాసం 22వ రోజున శివుడిని ఉమ్మెత్త పూలతో పూజించాలి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఉమ్మెత్త ఆకులతో శివుడిని పూజిస్తే అనారోగ్యాలు తొలగుతాయి. అలాగే సరి సంఖ్యలో (2,4,8,10,12) మారేడు దళాలతో శివుడిని పూజిస్తే ఆర్థికంగా పురోభివృద్ధి కలుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
బుధవారం అష్టమి తిథి ఉంది. బుధవారం అష్టమి తిథితో కలిసి వస్తే దీన్ని బుధాష్టమి అని పిలుస్తారు. కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమి తిథి కాబట్టి.. దీన్ని కాలాష్టమి అనే పేరుతోనూ పిలుస్తారు. ఇది కాళభైరవుడికి ఎంతో ఇష్టమైన రోజు. బ్లాక్ మ్యాజిక్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారు, మాపై ప్రయోగం చేశారనే అనుమానం ఉన్న వాళ్లు, ఎదుటి వాళ్ల ఏడుపు వల్ల మాకు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని అనుకునే వాళ్లు.. శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి, రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు పడుతున్నాం అనుకునే వాళ్లు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని బాధపడే వాళ్లందరూ ఈ బుధాష్టమి సందర్భంగా మిరియాల దీపాన్ని వెలిగించాలి. మిరియాల దీపాన్ని శివాలయంలో వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి.
మిరియాల దీపాన్ని ఇలా వెలిగించాలి..
కొత్త తెల్లటి వస్త్రం తీసుకోవాలి. అందులో 27 మిరియాలు ఉంచి మూట కట్టాలి. ఆ మూటను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నూనెలో నానేలా చూడాలి. ఆ తర్వాత సాయంత్రం దగ్గరలో ఉన్న కాళభైరవుడి మందిరానికి వెళ్లాలి. అక్కడ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నువ్వుల నూనెలో నానిన మూటనే ఒక ఒత్తిలా వేసి కాళభైరవుడి మందిరం సమీపంలో దీపం పెట్టండి. దీన్నే మిరియాల దీపం అని అంటారు.
బ్లాక్ మ్యాజిక్ లు పోగొట్టే శక్తి ఈ మిరియాల దీపానికి ఉంటుంది. కాళ భైరవుడి ఆలయం ఇంటికి దగ్గరలో లేకపోతో.. అలాంటి వారు మీ ఇంట్లోనే పడమర వైపున దీపాన్ని వెలుగించుకోండి. ప్రధానంగా బ్లాక్ మ్యాజిక్ లు, ఎదుటి వాళ్ల ఏడుపు పోవటానికి, ఇంట్లో నెగిటవ్ ఎనర్జీ పోవటానికి .. ఈ మిరియాల దీపం బుధాష్టమి, కాలాష్టమి రోజున అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
