Srisailam Temple: ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి..

శ్రీశైలం మహాక్షేత్రం ప్రముఖ పుణ్యక్షేత్రం. తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి పుణ్యక్షేత్రం.

Srisailam Temple: ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి..

Updated On : November 29, 2025 / 5:19 PM IST

Srisailam Temple: శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు శుభవార్త. ఇకపై భక్తులకు లడ్డూ ప్రసాదం ఉచితంగా ఇవ్వనున్నారు. డిసెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీపై ఆలయ ఛైర్మన్ రమేశ్ ప్రకటన చేశారు. స్పర్శ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు 2 లడ్డూలు ఇస్తారు. అతిశీఘ్ర దర్శనం టికెట్లు పొందిన భక్తులకు ఒక లడ్డూ ప్రసాదాన్ని ఫ్రీగా ఇవ్వనున్నారు. ఇక గోకులం ఆధునికీకరణ, కొత్త డొనేషన కౌంటర్‌, చైర్మన్ ఛాంబర్‌, ఉచిత లడ్డూ ప్రసాద, కైలాస కంకణ కౌంటర్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ఇటీవల ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదాలు అందించాలని అందులో నిర్ణయించారు. 500 రూపాయల స్పర్శ దర్శనం టికెట్‌పై 100 గ్రాముల లడ్డూలు 2 ఇస్తారు. 300 రూపాయల టికెట్‌పై 100 గ్రాముల బరువు ఉండే ఒక లడ్డూను ఉచితంగా ఇస్తారు.

శ్రీశైలం మహాక్షేత్రం ప్రముఖ పుణ్యక్షేత్రం. తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి పుణ్యక్షేత్రం శ్రీశైలం. నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. మల్లన్నను దర్శించుకుని పులకిస్తారు. శ్రీశైలం మహాక్షేత్రాన్ని భక్తులు రెండో తిరుపతిగా భావిస్తారు. తిరుపతిలో లడ్డూ ప్రసాదానికి ఎంత ప్రాధాన్యత ఉందో.. అదే విధంగా శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి లడ్డూ ప్రసాదానికి కూడా భక్తులు అంతే ప్రాధాన్యత ఇస్తారు. శ్రీశైలం వచ్చే ప్రతి భక్తుడు లడ్డు ప్రసాదం కొనుగోలు చేస్తాడు.

Also Read: ప్రాగస్తమిత శుక్ర మౌడ్యమి.. అంటే ఏమిటి? ఎప్పటి నుంచి ప్రారంభం? పొరపాటున కూడా చేయకూడని పనులేంటి..