Horoscope Today : ఈ రోజు రాజ్యమేలేది రాహువే.. ఇక ఈ రాశుల వారికి చుక్కలే.. అన్నింటా జాగ్రత్తగా ఉండటమే మీకు శ్రీరామ రక్ష!
Horoscope Today : రాహువు తన ఆధిపత్యం వహించే నక్షత్రాలు ఉన్నవారిని దండిగా అనుగ్రహిస్తాడు. కుజ రాశులైన మేషం, వృశ్చికాలకు చుక్కలు చూపిస్తాడు.

Today Horoscope
Horoscope Today : మీనాన్ని వీడుతున్న రాహువు.. శుక్రుడిని దాటుకొని వచ్చేశాడు. ఈ క్రమంలో ఉచ్ఛంగతుడైన శుక్రుడి బలాలన్నీ తాను సంతరించుకున్నాడు. ఫలితంగా తను ఆధిపత్యం వహించే నక్షత్రాలు ఉన్నవారిని దండిగా అనుగ్రహిస్తాడు. కుజ రాశులైన మేషం, వృశ్చికాలకు చుక్కలు చూపిస్తాడు.

Aries
మేషం: రవి అండగా ఉన్నా.. రాహువు కన్నెర్ర చేస్తున్నాడు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. లేని హెచ్చులకు వెళ్లి బోల్తా పడతారు. కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్త అవసరం. ష్యూరిటీలు ఇస్తే సమస్యలు తప్పవు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Taurus
వృషభం: రోహిణి నక్షత్రం వారికి సమస్యలు అధికం అవుతాయి. సోదరులతో వైరం ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో ఏమరుపాటు తగదు. కృత్తిక నక్షత్రం వారికి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. శివారాధన మేలు చేస్తుంది.

Gemini
మిథునం: ఆరుద్ర నక్షత్ర జాతకులను అదృష్టం వరిస్తుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార లావాదేవీలు లాభధాయకంగా సాగుతాయి. కొత్త ఒప్పందాలు కలిసివస్తాయి. భూ లావాదేవీల్లో నిదానంగా వ్యవహరించండి. గణపతి ఆరాధన శుభప్రదం.

Cancer
కర్కాటకం: తలపెట్టిన పనుల్లో విఘ్నాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండటం అవసరం. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. దైవబలం రక్షిస్తున్నది. వివాదాల జోలికి వెళ్లకండి. ఆరోగ్యంగా ఉంటారు. రామాలయాన్ని సందర్శించండి.

Leo
సింహం: ఆశావాద దృక్పథంతో ఉంటారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ… ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. రుణ బాధలు అధికమవుతాయి. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.

Virgo
కన్య: ఆలోచనలు స్థిరంగా ఉండవు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. సహోద్యోగులతో గొడవలకు ఆస్కారం ఉంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సూర్యారాధన మేలు చేస్తుంది.

Libra
తుల: ఆరోగ్యం మెరుగవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి ఉంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పెద్దలను కలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఇష్టదైవాన్ని ఆరాధించండి.

Scorpio
వృశ్చికం: గురువు కాపుకాస్తున్నా.. కుజుడు అందివచ్చిన అవకాశాలను చేజారుస్తున్నాడు. రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. మానసికంగా ఆందోళనలు ఉంటాయి. కొత్త ఒప్పందాల విషయంలో ఏమరుపాటు తగదు. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.

Sagittarisu
ధనుస్సు: మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి ఉంది. ఆస్తి తగాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. కుటుంబ పెద్దల సలహాలు పాటించడం వల్ల మేలు జరుగుతుంది. లక్ష్మీధ్యానం శుభప్రదం.

Capricorn
మకరం: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఓపికగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. బంధుమిత్రుల సహకారంతో కొన్ని కార్యాలు సిద్ధిస్తాయి. భూ లావాదేవీలు అనుకూలిస్తాయి. వ్యాపార ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి. ఒక శుభవార్త వింటారు. నరసింహస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
కుంభం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలున్నాయి. షేర్ మార్కెట్‌లో ఆచితూచి ఇన్వెస్ట్ చేయండి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.
మీనం: అయినవారితో నిదానంగా మాట్లాడటం అవసరం. శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు పట్టుదలతో బాధ్యతలు నిర్వర్తిస్తారు. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.
(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.