Horoscope Today: అండగా బుధుడు.. ఈ రాశుల వారికి ఆకస్మిక లాభాలు..!
ఈ రోజు అదృష్టం తలుపు తడుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. కీలక విషయాల్లో చాకచక్యంగా వ్యవహరిస్తారు. భూ లావాదేవీల్లో

Horoscope Today
Horoscope Today: బుధుడు స్వనక్షత్రమైన రేవతిలోకి ప్రవేశించాడు. నీచలో ఉన్నప్పటికీ.. సొంత నక్షత్రంపై సంచరించడం వల్ల తాను ఆధిపత్యం వహించే రాశుల వారినీ, నక్షత్రాల వారినీ అనుగ్రహిస్తాడు. శుక్ర నక్షత్ర జాతకులకు ఆకస్మిక శుభఫలితాలు ఇస్తాడు. వెరసి మేషం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, ధనుస్సు, మీన రాశుల వారిని బుధుడు అనుగ్రహిస్తాడు.
మేషం: ఈ రోజు అనుకూలంగా ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. భూ లావాదేవీల్లో లబ్ధి పొందుతారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
వృషభం: బంధుమిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులు కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు తగదు. సమయపాలన తప్పనిసరి. సూర్యారాధన శుభప్రదం.
మిథునం: ఈ రోజు అదృష్టం తలుపు తడుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. కీలక విషయాల్లో చాకచక్యంగా వ్యవహరిస్తారు. భూ లావాదేవీల్లో లబ్ధి చేకూరుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
కర్కాటకం: మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా పనులు చేస్తారు. పెద్దల అండదండలు పొందుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
సింహం: నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. గణపతి ఆలయాన్ని సందర్శించండి.
కన్య: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు మంచి సమయం. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా ఉన్నతంగా ఉంటుంది. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.
తుల: గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ఆలోచనలు అమలుచేయడంలో జాప్యం జరుగుతుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. దానికి తగ్గ ఫలితం పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
వృశ్చికం: రావలసిన డబ్బు అందుతుంది. రోజువారి లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. పెద్దల సూచనలు, సలహాలు పాటించడం అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. గణపతి గుడికి వెళ్లండి.
ధనుస్సు: ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఆహారం విషయంలో సమయపాలన అవసరం. శివారాధన శుభప్రదం.
మకరం: మంచి ఆలోచనలు అమలు చేస్తారు. తాత్కాలిక లబ్ధి పొందుతారు. వ్యాపారులు న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. సహోద్యోగులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. భూ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. సూర్యారాధన మేలు చేస్తుంది.
కుంభం: గ్రహస్థితి ఆశాజనకంగా లేదు. ప్రతి విషయంలోనూ శ్రద్ధ అవసరం. రోజువారీ కార్యకలాపాల్లో చిన్నచిన్న ఆటంకాలు తలెత్తుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. శివారాధన వల్ల మేలు జరుగుతుంది.
మీనం: శ్రమకు అదృష్టం తోడవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థాన చలన సూచన ఉన్నది. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.
(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.