Horoscope Today : ఈరోజు ఈ నాలుగు రాశుల వారు నక్కతోక తొక్కినట్టే..
Horoscope Today : ఈరోజు మార్చి 9 ఆదివారం.. ద్వాదశ రాశుల్లో ఈ నాలుగు రాశులవారికీ అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అదృష్టం కలిసివస్తుంది. ఆర్థికంగా ఊహించని ప్రయోజనం చేకూరనుంది.

Horoscope Today
Horoscope Today : ఈ రోజు వృషభ రాశి జాతకులకు ధైర్యే సాహసే లక్ష్మీ అన్నట్టుగా ఉంటుంది. గ్రహగతులు కర్కాటక రాశివారిని కదం తొక్కేలా చేస్తున్నాయి. కన్యా రాశివారికి పెద్ద ఊరట లభించనుంది. మకర రాశి జాతకులు రిలాక్స్ అయిపోవచ్చు. ఈ నాలుగు రాశులవారికీ.. అనుకూల ఫలితాలు ఉన్నాయి. అదృష్టం కలిసివస్తుంది. ఆర్థికంగా ఊహించని ప్రయోజనం చేకూరనుంది. ద్వాదశ రాశుల వారి ఫలితాలు పరిశీలిస్తే…

Aries
మేషం: కాగల కార్యం చిరు ప్రయాసతో నెరవేరుతుంది. అన్నాదమ్ముల సహకారం లభిస్తుంది. ఉద్యోగులు బాస్ మెప్పు పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. విందులకు హాజరవుతారు. ప్రశాంతతను కోల్పోవద్దని సూచన. దత్త స్తోత్రాలు పఠిస్తే మంచిది.

Taurus
వృషభం: గ్రహాలన్నీ బలవత్తరంగా యోగిస్తున్నాయి. శ్రమకు తగ్గ ఫలితాలు అందుకుంటారు. తెలివిగా వ్యవహరిస్తారు. స్త్రీ మూలకంగా ధనలాభం ఉంటుంది. ప్రతికూల పరిస్థితులను మంచి మాటతో అనుకూలంగా మార్చుకోగలుగుతారు. క్షేత్ర దర్శనం సూచితం. హనుమాన్ చాలీసా చదువుకోండి.

Gemini
మిథునం: పట్టుదలగా ఉంటారు. దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి సారిస్తారు. కోపానికి గురయ్యే సందర్భాలు ఎదురైతాయి. ముఖ్యంగా తండ్రితో, సోదరులతో విభేదాలు తలెత్తవచ్చు. సంయమనం పాటించడం అవసరం. నిదానమే ప్రధానం అని గుర్తించండి. శివారాధనతో మేలు కలుగుతుంది.

Cancer
కర్కాటకం: చాలాకాలంగా వేదిస్తున్న సమస్యకు మంచి పరిష్కారం దొరుకుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. అవి మీ ఎదుగుదలకు బాటలు పరుస్తాయి. ఆర్థికంగా బలపడతారు. అయితే స్వల్ప విషయాలకు ఆందోళన చెందకండి. దగ్గరి వారిని దూరం చేసుకోకండి. ఆదిత్య హృదయం పఠించండి.

Leo
సింహం: శ్రమ పెరుగుతుంది. స్థిరాస్తికి సంబంధించి మంచి నిర్ణయం తీసుకుంటారు. సోదరి మూలకంగా స్వల్ప చికాకులు తలెత్తవచ్చు. మాట పట్టింపులకు పోవద్దు. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. సద్గురువును ఆశ్రయిస్తారు. ఆధ్యాత్మికంగా మంచి మార్పు కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠించండి.

Virgo
కన్య: పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. పెద్దల అండదండలు లభిస్తాయి. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. భూ వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. దైవబలం వెన్నెంటి నడిపిస్తుంది. కుటుంబసౌఖ్యం ఉంది. రామాలయాన్ని సందర్శించండి.

Libra
తుల: ఆరోగ్య పరంగా చికాకులు తలెత్తుతాయి. స్త్రీతో వాగ్వాదాలు జరగవచ్చు. సంయమనం పాటించడం అవసరం. విలువైన వస్తువుల పట్ల అజాగ్రత్త వద్దు. సంతానం విషయంలో స్వల్ప ఆందోళన కలుగుతుంది. మనోబలంతో వాటిని అధిగమిస్తారు. ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Scorpio
వృశ్చికం: చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనుల్లో కదలిక వస్తుంది. మీరు వేసే ఎత్తులు చాలా కీలక పరిణామాలకు దారితీస్తాయి. అవి మీకు అనుకూల ఫలితాలు ఇస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. శివాలయాన్ని సందర్శించండి.

Sagittarisu
ధనుస్సు: మనసు పరిపరివిధాల ఆలోచిస్తుంది. సోదరులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. సంయమనం పాటించడం అవసరం. విదేశాల నుంచి అనుకూల వర్తమానం అందుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఆహార నియమాలు పాటించడం అవసరం. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి.

Capricorn
మకరం: రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది. ఉన్నతమైన ఆలోచనలు చేస్తారు. కెరీర్ గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని వెంటనే అమల్లో పెడతారు. పెద్దవారి సహాయ సహకారాలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
కుంభం: చికాకులు ఎన్ని ఉన్నా.. రోజంతా మీ కంట్రోల్‌లోనే ఉంటుంది. భోజన సౌఖ్యం ఉంది. ఆర్థికంగా కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు. దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. తండ్రితో మాట పట్టింపులు రావొచ్చు. కాస్త తగ్గితే మీకే మంచిది. ఆదిత్యహృదయం పఠించండి.
మీనం: రకరకాల ఆలోచలు వస్తుంటాయి. అయితే స్పష్టత ఉండకపోవచ్చు. సోదరుల సహకారం లభిస్తుంది. భూ లావాదేవీల్లో కొంత లాభం అందుకుంటారు. వాహన సౌఖ్యం ఉంది. ఇతరుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయకండి. వారి వల్ల మేలు జరగకపోగా, చికాకులు తలెత్తవచ్చు. నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి.
టి. భుజంగరామ శర్మ
77022 86008
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.