Kaal Sarp Yog: కేతువు రెమెడీస్ ఇవే.. కష్టాలన్నీ తొలగిపోయి, లైఫ్ అంతా హ్యాపీ
ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన వివరాలు..
Kaal Sarp Yog (Image Credit To Original Source)
Kaal Sarp Yog: కేతువు వల్ల ఎన్నో అడ్డంకులు, మానసికంగా గందరగోళం, భౌతిక విషయాలపై విరక్తి, ఒంటరితనం వంటి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. దీనికి రెమెడీస్ ఉన్నాయి.
1) ఉలవలు దానం ఇవ్వండి
2) వైఢూర్యం దానం ఇవ్వండి
3) చిత్రవర్ణ వస్త్రం దానం ఇవ్వండి
4) ఉలవలను ప్రవాహనదిలో వేయండి
5) వెండిపాత్రలో తేనె ఉంచండి
6) తొమ్మిదిరోజులు 9 నిమ్మకాయలు నదిలో వేయండి
7) వెండిపాత్రలో తేనెను ఉంచండి
8) తొమ్మిది రోజుల 9 బొగ్గులు నదిలో వేయండి
9) గణపతిని పూజించి ఉపవాసము ఉండి, అరటిపళ్లను దానం చేయండి.
10. తెలుపుదిగాని, నలుపుదిగాని, చిత్రవర్ణంగాని దుప్పటి దానము చేయండి.
11. ఖర్జూరపండ్లు, కొబ్బరికాయలు దానం చెయ్యండి.
12. దర్భను నదిలో వదలండి.
13. మంగళవారము రోజు కుజహోర కాలములో కేతువుకు అభిషేకము చేసి ఉలవలు, చిత్రవర్ణవస్త్రం బ్రాహ్మణులకు దానం చేయండి.
14. బియ్యపు పిండి తాటిబెల్లంతో కలిపి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయంలో కేతుస్తోత్ర పారాయణము చేసి చీమలు మొదలగు క్రిమికీటకాలకు నివేదన చేయాలి.
15. వైఢూర్యము ధరించాలి.
16. మంగళవారము రోజున బ్రాహ్మణులకు ఉలవలతో చేసిన వంటకాలలో భోజనము పెట్టి దక్షిణతాంబూలాదులతో సంతృప్తి పరచాలి.
17. అష్టముఖి లేక నవముఖి రుద్రాక్షలు ధరించాలి.
18. దానిమ్మ పండ్లను దానం చేయాలి.
19. పదితలల వెండి సర్పమును దానం చేయాలి.
20. సాంబ్రాణి, నువ్వుచెట్టు ఆకులు, ఏనుగుదంతము, మేక మూత్రము,
మారేడుపట్ట, వీటిని నీళ్లలోవేసి వేడిచేసి ఆనీటితో స్నానము చేయాలి.
21. ఉలవలు, వైఢూర్యము, నూనె, శాలువ, కస్తూరి దానము చేయాలి.
22. ఖడ్గమృగము కొమ్ముతో చేసిన పాత్రలో నీరు పోసి పర్వతములలో పంది కొమ్ము తొవ్విన మట్టి, మేకపాలు కలిపి ఆ నీటితో స్నానము
చేయాలి.
23. మంగళవారము రోజున ఓం ప్రాం హ్రీం క్రౌం సఃకేతవేనమః మంత్రమును 40 రోజులలో 7 వేలు జపము చేసి చిత్రవర్ణము వస్త్రములో ఉలవలు దానము ఇవ్వాలి.
24. ఎండు ఖర్జూరఫలాలు 70 మంది బ్రాహ్మణులకు దక్షిణ సహితంగా దానము చేయాలి.
25. ఉలవలతో ప్రసాదము చేసి శ్రీమహాగణపతికి ప్రసాదము నివేదన చేయాలి.
26. ఉలవలు, నువ్వులు, అరటికాయలు, చింతపండు, ఉల్లిపాయలు, వెల్లులి బ్రాహ్మణులకు దానం చేయాలి.
27. తెల్లజిల్లేడుతో చేసిన గణపతిని ప్రార్థించండి.
28. కంచుపాత్రలు, ఇనుముపాత్రలు దానం చేయాలి.
29. గుమ్మడి పండును, వెండి గుర్రమును అశ్విని, మఖ, మూల నక్షత్రములలో దానము చేయాలి.
30. కుడుములు, పులిహోర, గుగ్గిళ్లను గణపతికి నైవేద్యం నివేదన చేసి అందరికీ పంచండి.

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
