నాగారాధన రహస్యము.. మీరు పాపాలు చేశారా? అన్నీ పోయి మీ జేబుల్లో డబ్బులు నిండాలంటే ఇలా చేయండి..

సర్వాభీష్ట సిద్ధికి, సకల పాపములు తొలగడానికి, ఆందోళనలు పోవడానికి ప్రతిరోజు ఈ మంత్రములను పఠించాలి.

నాగారాధన రహస్యము.. మీరు పాపాలు చేశారా? అన్నీ పోయి మీ జేబుల్లో డబ్బులు నిండాలంటే ఇలా చేయండి..

Updated On : November 10, 2025 / 10:50 PM IST

Kaal Sarp Dosh: నాగారాధనకు భారతీయ సంప్రదాయములో విశిష్ఠమైన స్థానము ఉంది. సర్పములను పూజచేయడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది. మంచి సంతానము కలుగుతుంది. ఇవేకాక రాహుకేతువుల ద్వారా వచ్చే దోషములు, కుజదోషము, చెవి సంబంధిత వ్యాధులు, వివాహ సంబంధిత సమస్యలు పోవడానికి, మనఃశాంతి కోసం నాగదేవతలను పూజించాలి.

“నతేషాం సర్వతో వీరభయంభవతి కుత్ర చిత్”
సర్వపాప వినిర్ముక్త స్సర్వాన్ కామాన్ నమశ్శుతే॥

పై శ్లోకాన్ని అనుసరించి సర్పపూజ చేసిన వారికి సర్పభయం ఉండదని నాగారాధన వల్ల సమస్త పాపములు తొలగుతాయని తెలుస్తుంది. (Kaal Sarp Dosh)

సర్పగాయత్రి మంత్రములు:

1) ” ఓం నాగకులాయ విద్మహే విషదంతాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్”
2) “నాగరాజాయ విద్మహే పృథ్వీధరాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్”

నవనాగ మంత్రము:
అనంత, వాసుకీం, శేషం, పద్మనాభం, కంబళం,
శంఖపాలం, ధృతరాష్ట్రం, తక్షకం, కాళీయం తథా
ఏతాని నవనామాని నాగానం మహాత్మనే
సాయంకాలం పఠేనిత్యం, ప్రాతఃకాలే విశేషతః
తస్స విషభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్

జనమేజయుని సర్పయాగములో సర్పజాతి అంతరించిపోతుందేమో అని సర్పదేవతలు బ్రహ్మను శరణువేడగా.. బ్రహ్మదేవుడు వారిని కరుణిస్తాడు. మీకు ఆస్తిక మహర్షి ద్వారా ముప్పు తప్పుతుందని వరము ఇచ్చాడు. ఈ వరము వల్ల భూలోకవాసులు నాగదేవతలను పూజిస్తారు, ఆరాధిస్తారు. పండుగలు జరుపుకుంటారు. నాగదేవతలను షోడశోపచారములతో పూజించుతారు, సర్ప అభిషేకములు చేస్తారని అని బ్రహ్మ వరము ఇచ్చాడు.

Also Read: కేతువు ఆరాధనలో గణపతి ప్రాశస్త్యము.. ఇలా పూజిస్తే మీ సమస్యలన్నీ పారిపోతాయ్.. ఐశ్వర్యం అంతా మీదే….

సర్వాభీష్ట సిద్ధికీ, సకలపాపములు తొలగడానికి, ఆందోళనలు తొలగుటకు ప్రతిరోజు ఈ కింది మంత్రములను పఠించాలి. మన దేశంలో ముఖ్యంగా శ్రావణమాసములో వచ్చేపంచమి, కార్తీకమాసములో వచ్చే నాగుల చవితి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

శ్రావణమాసంలో వచ్చే పంచమిని నాగపంచమి అని, గరుడపంచమి అని వెనుకటి రోజుల్లో నాగచతుర్థి అని పిలుస్తారు. ఈ నాగ పంచమి విష్ణు సంబంధమైనది. ఇక కార్తీకమాసములో వచ్చే నాగులచవితి శివ సంబంధమైనది. ముఖ్యంగా నాగదోషము వలన సంతానానికి అవరోధములు ఏర్పడతాయి. నాగదేవతను ప్రసన్నమును చేసుకోవడం వల్ల సర్వకష్టములు తొలగుతాయి.

నాగారాధన గురించి, దాని పూజావిధానమును, ఫలితములను భవిష్యత్ పురాణములో వ్రత చూడామణి ప్రభాసఖండములో రాశారు. ప్రతిరోజు సర్పములను ప్రార్థించాలి. ఈ కింది విధంగా..

1. శ్లో॥ కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్యచ।
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్||

2. శ్లో॥ సర్వాపసర్ప భద్రం తే దూరం గచ్ఛమహవిష
జనమేజయ యాగాంతే ఆస్తిక వచనం స్మర॥
అనంతాయ నమస్తుభ్యం సహస్ర శిరసే నమః॥
నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః॥
అనంతో వాసుకిః శేషః పద్మనాభశ్చ కంబళః
శంఖకపాలో ధార్తరాష్ట్రః తక్షకః కాళియు స్తథా|
ఏతేషాం నవ నామాని నాగానంచ మహాత్మనామ్ |
సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః॥
విషాస్తస్య భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్||

3. శ్లో॥ పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ।
సత్సాంతాన సంపత్తిం దేహిమే శంకరప్రియే॥
అనంతాది మహా నాగరూపాయ వరదాయచ|
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా॥

BrahmaSRI DR Nayakanti Mallikarjuna Sharma

పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ

Ph: 9849280956, 9515900956