Horoscope Today: గజకేసరి యోగం యాక్టివేట్.. ఈ రాశుల వారికి కాలం కలిసొస్తుంది..!
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు అందుతుంది. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి.

Today Horoscope
Horoscope Today: రోహిణి నక్షత్రంపైకి ప్రవేశించి చంద్రుడు.. గురువుతో కూడి గజకేసరి యోగాన్ని మళ్లీ యాక్టివేట్ చేశాడు. బుధుడి అనుగ్రహం కూడా జతకలవడంతో ఈ రోజు చంద్ర నక్షత్ర జాతకులకు, బుధ నక్షత్ర జాతకులకు మేలు కలుగుతుంది. వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి కాలం కలిసొస్తుంది.
మేషం: సాహసించి పనులు చేస్తారు. అన్నదమ్ములతో సఖ్యత లోపిస్తుంది. పెట్టుబడుల విషయంలో ఏమరుపాటు తగదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. సూర్యారాధన శుభప్రదం.
వృషభం: ఈ రోజు అనుకూలంగా ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మంచివారితో సాహచర్యం కలుగుతుంది. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. శివాలయాన్ని సందర్శించండి.
మిథునం: ఈ రోజు ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రారంభించిన పనులు నిదానంగా ముందుకుసాగుతాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉన్నా.. ఉపశమనం పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
కర్కాటకం: ఈ రోజు అనుకూల సమయం. సమయస్ఫూర్తితో చేసే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరచరాస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. శివాలయాన్ని సందర్శించండి.
సింహం: ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం. అధికారులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో సోదరులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. దత్తాత్రేయస్వామి ఆరాధనతో మేలు జరుగుతుంది.
కన్య: ఉద్యోగులకు ఉన్నతమైన సమయం. బాధ్యతలు పెరిగినప్పటికీ, అందుకు తగ్గట్టుగా పనిచేస్తారు. అధికారుల అండదండలు లభిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
తుల: శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు అందుతుంది. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. మంచివారి సాహచర్యం లభిస్తుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.
వృశ్చికం: కొన్ని విషయాల్లో తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులకు శుభ సమయం. అధికారుల మన్ననలు అందుకుంటారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు మంచి సమయం. దుర్గా స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: ఈ రోజు అనుకూలంగా ఉంది. సాహసంతో ముందుకువెళ్తారు. పనుల్లో విజయాన్ని సాధిస్తారు. సమయపాలన అవసరం. వ్యాపారులకు మంచి సమయం. న్యాయపరమైన సమస్యలు అధిగమిస్తారు. శివాలయాన్ని సందర్శించండి.
మకరం: శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు పెరగవచ్చు. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పెద్దల సలహా పాటిస్తారు. సూర్యారాధన మేలు చేస్తుంది.
కుంభం: ఆరోగ్యంగా ఉంటారు. ఉల్లాసంగా పనులు చేస్తారు. ఖర్చుల నియంత్రణ, పనులపై ఏకాగ్రత అవసరం. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
మీనం: ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.
(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.