Dhanu Rashi Ugadi Rasi Phalalu 2025 : ధనుస్సు రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు..
ఉద్యోగంలో స్థానచలన సూచన. వృత్తి, వ్యాపారాల్లో అనాలోచిత నిర్ణ-యాల నష్టం ఏర్పడవచ్చు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి.

Sagittarius
Dhanu Rashi Ugadi Rasi Phalalu 2025 : కొత్త ఆశలతో అడుగుపెట్టిన ఉగాది.. కొన్ని రాశుల వారిని ఆర్థికంగా అనుగ్రహిస్తే, మరికొన్ని రాశుల వారి యశస్సు పెంచనుంది. త్రిగ్రహ, చాతుర్ గ్రహ, పంచగ్రహ కూటములు అన్ని రాశుల వారినీ ఎంతో కొంత చికాకు పెడతాయి. ముఖ్యంగా మేష రాశికి ఏల్నాటి శని ప్రారంభం అవుతున్నది. సింహరాశికి అష్టమ శని, ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని చికాకులు తెప్పిస్తుంది.
అయితే, ఈ మూడు రాశులకూ రాహు, కేతువులు అండగా నిలవనున్నారు. మేషరాశికి లాభ రాహువు, ధనుస్సు రాశికి సప్తమ గురువు, సింహరాశికి లాభ గురువు ఉండటం వల్ల.. శని వల్ల కలిగే ఆటంకాలు తీవ్రంగా ఇబ్బంది పెట్టవు. ఈ మూడు రాశుల వారూ నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. శక్తి మేరకు అనాథలకు దాన ధర్మాలు చేయడం వల్ల సత్ఫలితాలు పొందుతారు.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆదాయం: 5 వ్యయం: 5
రాజపూజ్యం: 1 అవమానం: 5
చైత్రం: వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభ-దాయకంగా సాగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. సంయమనంతో పనులు చేస్తారు. ఆత్మీయుల సహకారం
లభిస్తుంది.
వైశాఖం: ప్రారంభించిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రభుత్వ, రాజకీయ, కోర్టు పనులలో సానుకూలత ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు.
జ్యేష్ఠం: వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వాహనం మూలంగా ఖర్చులు ముందుకు వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. స్నేహితులు, బంధువుల మూలంగా పనులు నెరవేరుతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది.
ఆషాఢం: వృత్తి, వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉంటూ పనులపై మనసు నిలపడం మంచిది. దైవ దర్శనంతో ఉపశమనం లభిస్తుంది.
శ్రావణం: ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. నూతన ఒప్పందాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.
భాద్రపదం: ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. సంయమనంతో పనులు చేస్తారు. ఆత్మీయులు, స్నేహితుల కల-యిక ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది.
ఆశ్వయుజం: కొత్త పనులపై మనసు నిలుపుతారు. ఆరోగ్యంగా ఉంటూ, ఉత్సా-హంగా పనులు చేస్తారు. ఆత్మీయుల సూచనల మేర పనులు చేసి, సత్ఫలితాలను పొందుతారు. నలుగురిలో పరపతిని సంపాదిస్తారు.
కార్తికం: గ్రహస్థితి అనుకూలంగా ఉంది. బంధువుల సహకారం లభిస్తుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు అనుకూలం. వాహనం కొనుగోలు చేస్తారు. భూ వ్యవహారము లాభిస్తుంది.
మార్గశిరం: విహార యాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. ఆస్తుల విషయంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
పుష్యం: ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో వివాదాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. భూ వ్యవహారంలో ఇబ్బం-దులు ఉంటాయి. కళాకారులకు మంచి సమయం.
మాఘం: ఉద్యోగంలో స్థానచలన సూచన. వృత్తి, వ్యాపారాల్లో అనాలోచిత నిర్ణ-యాల నష్టం ఏర్పడవచ్చు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. పెద్దల సహ-కారం లభిస్తుంది. స్నేహితులు, ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి.
ఫాల్గుణం: శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో ఉన్న సమస్యలను అధి-గమిస్తారు. సంయమనంతో పనులు చేస్తారు. రావలసిన డబ్బు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులపై మనసు నిలుపుతారు.