Simha Rashi Ugadi Rasi Phalalu 2025 : సింహ రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు..

ఆత్మీయుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సంయమనంతో పనులు పూర్తిచేస్తారు. కుటుంబ పెద్దల సలహాలు, సూచనలను పాటిస్తారు.

Simha Rashi Ugadi Rasi Phalalu 2025 : సింహ రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు..

Leo

Updated On : March 30, 2025 / 12:38 AM IST

Simha Rashi Ugadi Rasi Phalalu 2025 : కొత్త ఆశలతో అడుగుపెట్టిన ఉగాది.. కొన్ని రాశుల వారిని ఆర్థికంగా అనుగ్రహిస్తే, మరికొన్ని రాశుల వారి యశస్సు పెంచనుంది. త్రిగ్రహ, చాతుర్‌ గ్రహ, పంచగ్రహ కూటములు అన్ని రాశుల వారినీ ఎంతో కొంత చికాకు పెడతాయి. ముఖ్యంగా మేష రాశికి ఏల్నాటి శని ప్రారంభం అవుతున్నది. సింహరాశికి అష్టమ శని, ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని చికాకులు తెప్పిస్తుంది.

అయితే, ఈ మూడు రాశులకూ రాహు, కేతువులు అండగా నిలవనున్నారు. మేషరాశికి లాభ రాహువు, ధనుస్సు రాశికి సప్తమ గురువు, సింహరాశికి లాభ గురువు ఉండటం వల్ల.. శని వల్ల కలిగే ఆటంకాలు తీవ్రంగా ఇబ్బంది పెట్టవు. ఈ మూడు రాశుల వారూ నిత్యం హనుమాన్‌ చాలీసా పఠించడం మంచిది. శక్తి మేరకు అనాథలకు దాన ధర్మాలు చేయడం వల్ల సత్ఫలితాలు పొందుతారు.

సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయం: 11 వ్యయం: 11
రాజపూజ్యం: 3 అవమానం: 6
చైత్రం: ఆత్మీయుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సంయమనంతో పనులు పూర్తిచేస్తారు. కుటుంబ పెద్దల సలహాలు, సూచనలను పాటిస్తారు.
వైశాఖం: ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. పలుకు-బడి పెరుగుతుంది. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఆస్తుల విషయంలో ఉన్న తగాదాలు పరిష్కారం అవుతాయి. భూమి కొనుగోలు చేస్తారు.
జ్యేష్ఠం: వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు.
ఆషాఢం: రాజకీయ, కోర్టు వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. కొత్త పరిచ-యాలతో కార్యసాఫల్యం ఉంటుంది. ఉద్యోగులకు అనుకూల స్థానచలన సూచన ఉంది. సహోద్యోగులతో సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు.
శ్రావణం: ఈ నెలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. శ్రమ అధికం అవు-తుంది. ఖర్చులు పెరుగుతాయి. నెల చివరికల్లా కొన్ని సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగులకు అధికారులతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి.
భాద్రపదం: ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపు-తారు. అయితే, ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులతో వైషమ్యాలు ఏర్పడతాయి.
ఆశ్వయుజం: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమంగా పెరుగుతుంది. అన్నదమ్ములతో ఆస్తుల విషయమై ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది.
కార్తికం: ఈ నెలలో గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. భూముల వ్యవహారం అనుకూలిస్తుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు.
మార్గశిరం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆరోగ్యంతో ఉంటూ, ఉత్సాహంతో పనులు చేస్తారు.
పుష్యం: ఈ నెల అనుకూలిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. వృత్తి, వ్యాపారం లాభసాటిగా కొనసాగుతాయి. కొత్త ఒప్పందాలు అనుకూలిస్తాయి.
మాఘం: ప్రారంభించిన పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. నలుగురికి సాయపడతారు. దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కార్యసాఫల్యం ఉంది.
ఫాల్గుణం: ఆస్తి వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణ పనులను చేప-డతారు. ఇంటా, బయటా పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను ఏకాగ్రతతో పూర్తిచేస్తారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది.