ఈ వారం రాశిఫలాలు (జనవరి 25 నుంచి 31 వరకు).. ఈ రాశివారికి అధిక లాభాలు, ఏం కోరుకుంటే అది జరిగి..

ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన 12 రాశుల ఫలితాలు...

ఈ వారం రాశిఫలాలు (జనవరి 25 నుంచి 31 వరకు).. ఈ రాశివారికి అధిక లాభాలు, ఏం కోరుకుంటే అది జరిగి..

Rashi Phalalu (Image Credit To Original Source)

Updated On : January 21, 2026 / 6:19 PM IST

ఈ వారం రాశిఫలాలు (జనవరి 25 నుంచి 31 వరకు)

గురువు మిధున రాశిలో వక్రగతి
శని మీనరాశిలో
రాహుకేతువులు కుంభసింహ రాశులలో
రవిబుధులు, కుజ శుక్రులు మకర కాశిలో
చంద్రుడు మీన మేష వృషభ మిధున రాశులలో సంచారం
చాతుర్గ్రహ కూటమి ఏర్పడింది

మేష రాశి: బంధుమిత్రులతో స్నేహపూర్వక వాతావరణం, వ్యాపారంలో అధిక లాభాలు, గొప్ప వ్యక్తుల పరిచయములు, ఆశించిన ఫలితములు ఉద్యోగంలో రావడం, విద్యార్థులకు పోటీ పరీక్షలలో అనుకూలముగా ఉండును, గృహోపకరణాలు కొనుగోలు చేయడం: ఇష్టదైవ ఆరాధన వలన అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి.

వృషభ రాశి: ఎలాంటి వివాదాలకు తావివ్వకండి, ఉద్యోగ భద్రత అవసరం, వ్యాపార భాగస్వామ్యం విషయంలో జాగ్రత్త అవసరము, వృధా ప్రయాణములు చేయకూడదు, అనవసరపు ఆలోచనలు చేయకూడదు, స్త్రీలు భర్తకు తోడుగా ఉంటారు: గణపతి ఉపాసన చేస్తే శుభం కలగుతుంది.

మిధున రాశి: శుభ కార్యక్రమాలలో పాల్గొనడం, విరోధములు, తగవులు తగ్గించుకోవాలి, కోర్టు సమస్యల వలన ఇబ్బందులు, అలసట, ఉద్యోగ అధికారులతో వివాదములు, చిన్నచిన్న విషయములు పెద్దవిగా చేసుకోవటం, పనులలో ఆలస్యములు, వ్యాపారాలో తగాధలు, అనారోగ్యము: శ్రీలక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

కర్కాటక రాశి: కుటుంబంలో ఆనందం, ఆకస్మిక ధనలాభం, ఆరోగ్యం కుదుటపడటం, సరియైన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకోవడం, కీర్తిప్రతిష్టలు, సరియైన ఆలోచనలు, కోపము తగ్గుతుంది, మంచి ఆలోచనలు, వృత్తి, ఉద్యోగములలో లాభములు, విదేశాలకు వెళ్లడం, దూర ప్రయాణములవలన లాభములు: గణపతి గాయత్రీ మంత్రము చదవితే మంచి ఫలితములు వస్తాయి.

సింహ రాశి: విజయ ప్రాప్తి, వృత్తి ఉద్యోగములలో లాభములు, తీర్థ యాత్రలు చేయడం, శత్రువులు మిత్రులుగా మారుతారు, గౌరవ సన్మానములు, సమష్టి కార్యక్రమములు, ధన ధాన్య లాభములు, కుటుంబంలోని వారు ఆరోగ్యంగా ఉంటారు, అధికారుల అభిమానము, విద్యావంతులకు గౌరవ సన్మాములు పొందుతారు: దుర్గ,గణపతి ఆరాధనలు చేయడం వలన ఉత్తమ ఫలితములు వస్తాయి.

కన్యా రాశి: అనారోగ్యం, అజీర్ణ సమస్యలు, భయము, మనస్తాపము, మానసిక ప్రశాంతత లేకపోవడం, స్థానచలనము, శరీరపీడ, స్త్రీతో సంగమం, అత్యాశ పెరగడం, కష్టములు రావడం, బుద్ధి చాంచల్యము, అనవసర కార్యములకు ధనవ్యయం, బుణ బాధలు, శత్రువులు పెరగడం: కాలభైరవాష్టకం చదవడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

తులా రాశి: ప్రతి పనిలో ఆటంకములు, వాహన సౌఖ్యములు ఉండవు, స్థానచలనము, కలహములు, అపకీర్తి, ఋణబాధలు, కార్యభంగము, శరీరపీడ, మోసపోవడం, వృథాప్రయాణములు, ప్రయాణంలో ఇబ్బందులు: కార్తికేయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభం జరుగుతుంది.

వృశ్చిక రాశి: ఆకస్మిక ధన లాభములు, బంధు వర్గములో గౌరవము, ఇరుగుపొరుగువారితో అనుకూలము, కుటుంబంలో వారికి ఆనందము, ప్రతి విషయములో అనుకూలము, వృత్తి ఉద్యోగ వృత్తులలో లాభములు, బంధువర్గములలో గౌరవమర్యాద పెరగటం: గణపతి పంచరత్న స్తోత్రం పారాయణం చేయటం వల్ల మంచి జరుగును.

ధనస్సు రాశి: ధన విషయంలో చికాకులు, నమ్మిన వారి వలన మోసపోవడం, స్త్రీ మూలకంగా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఆకస్మిక స్థానచలనము, దూర ప్రయాణాలతో వస్తునష్టం, అకాల భోజనములు, గొడవలకు, తగాదలకు దూరంగా ఉండాలి, ఆపదలు, అపాయములు, అవరోధములు పెరగడం: సుందర కాండ పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

మకర రాశి: ఆకస్మిక విజయం, ఋణబాధా విముక్తి, దేవతా కార్యక్రమం, న్యాయ వ్యవహారాలలో విజయము, వృత్తి, వ్యాపారములలో అభివృద్ధి కార్యసిద్ధి, కోపంతో సమస్యలు, సుఖసంతోషములు, శుభకార్యక్రమములు: శివాలయంలో దీపారాధన చేయడం వలన ఉత్తమ ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి: ఆకస్మిక ధన నష్టం, పై అధికారులతో మాటలు పడవలసి వచ్చును, మనస్సుకు ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతాయి, ప్రయాణములో అలసట కలుగును, బద్దకం పెరుగుతుంది, ఊహించని విషయములలో దెబ్బతింటారు, వ్యాపారంలలో గొడవలు జరుగుతాయి: దత్తాత్రేయ కవచం చదవడం వలన మంచి జరుగును.

మీనా రాశి: శుభవార్తలు, ధన ధాన్య లాభములు, లాభములు, వృత్తి, ఉద్యోగములయందు ఊహించని లాభములు కలుగును, కుటుంబములోవారికి ఆనందము కలుగును, లాభదాయకమైన ప్రయాణములు చేయడం, ప్రభుత్వ సహాయం లభించడం, ఉద్యోగంలో మార్పులు, నూతన వ్యాపారంలో మంచి లాభములు: కనకధార స్తోత్ర పారాయణం చేయడం వల్ల అధిక లాభములు కలుగుతాయి.

Brahma SRI DR Nayakanti Mallikarjuna Sharma

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ

Contact: 9849280956, 9515900956