ట్రెండీగా కలల సౌధం.. తక్కువ బడ్జెట్లోనే అధిక మన్నికతో ఇంటీరియర్
కస్టమైజేషన్ ఆప్షన్‌తో తక్కువ బడ్జెట్‌లోనే మాడ్యులర్ కిచెన్ అందుబాబులో ఉన్నాయి. మార్కెట్‌లో డిమాండ్‌లో ఉన్న మాడ్యులర్ ఇంటీరియర్స్‌తో మీ ఇంటి అందాన్ని ఎన్నో రెట్లు పెంచుకోవచ్చని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

Affordable Full Home Interiors with customization in Hyderabad
Affordable Full Home Interior: ఇంటీరియర్ డిజైన్.. ఇంటికి వన్నె తెచ్చే మాటే.. కానీ ఇప్పుడు మన బిజీ లైఫ్‌లో ఇది ఒక కీలక పాత్ర పోషిస్తోంది. అటు టైమ్, స్పేస్ సేవింగ్, సేఫ్టీతో పాటు లైఫ్ మేడ్ ఈజీ కూడా. అంటే మన పనిని సులభతరంగా చేసుకునుందుకే ఈ ఆధునిక ఇంటీరియర్ డిజైనింగ్ దోహదపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఇంటీరియర్స్‌పై ఎక్కువగా మక్కువ చూపుతున్నారు.
ఆధునిక సాంకేతికను అందిపుచుకున్న ఇంటీరియర్ డిజైనింగ్ నిపుణులు ఇప్పుడు లైఫ్ మేడ్ ఈజీ ఇంటీరియర్స్ మీద దృష్టి పెట్టారు. అందుకే మరి ఇంటి కిచెన్ మొదలుకొని, లివింగ్ రూం, బెడ్రూమ్, సెన్సార్‌తో పనిచేసే కిచెన్‌లోని చిమ్నీ, బాత్రూమ్‌లోని టాయిలెట్ ఫ్లష్.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం ఇంటీరియర్ డిజైన్స్‌లో నయా ట్రెండ్‌గా మారాయి. కస్టమైజేషన్ ఆప్షన్‌తో తక్కువ బడ్జెట్‌లోనే మాడ్యులర్ కిచెన్ అందుబాబులో ఉన్నాయి. మార్కెట్‌లో డిమాండ్‌లో ఉన్న మాడ్యులర్ ఇంటీరియర్స్‌తో మీ ఇంటి అందాన్ని ఎన్నో రెట్లు పెంచుకోవచ్చని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
ఇల్లు మరీ ట్రెండీగానూ ఉండకూడదు. అలాగని మరీ పాత కాలం దానిలాగానూ ఉండకూడదు. కాస్త ట్రెండింగ్‌గా, కాస్త వింటేజ్ లుక్‌లో ఉండే ఇంటీరియర్స్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయంటున్నారు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్లు. ఇలా పాత, కొత్తల మేలు కలయిక ఇంటికి కొత్త అందాన్ని తెచ్చి పెడుతుందని చెబుతున్నారు. అందుకనే అలంకరించుకునే వస్తువుల విషయంలో కొన్ని పాత వస్తువులను చేర్చమని సలహా ఇస్తున్నారు.
Also Read: ఆఫీస్ స్పేస్ డెవలప్‌మెంట్‌లో హైదరాబాద్ దూకుడు.. చెన్నై తర్వాత మనమే
ఇంట్లో ఎన్ని అలంకరణలు చేసినా సరే సహజమైన కాంతి తగినంత రాకపోతే అసలు అందంగానే కనిపించదు. అందుకనే కిటికీ అద్దాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని.. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే వాటినే ఎంపిక చేసుకోవాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. సింప్లిసిటీతో మంచి లుక్ వచ్చే వాటిని ఎంపిక చేసుకోవాలని.. ఎక్కువ హడావిడి ఉన్న వాటి జోలికి అస్సలు వెళ్లొద్దని వారు సజెస్ట్ చేస్తున్నారు.