Export Of Wheat Flour: ఇప్పటికే గోధుమ ఎగుమతులపై భారత్ నిషేధం.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం

భార‌త్‌లో పెరిగిపోతున్న ఆహార ధాన్యాల ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గోధుమ ఎగుమతులను నిషేధించింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. గోధుమ పిండి ధరలను కట్టడి చేయడానికి దాని ఎగుమతులపై పరిమితులు విధిస్తామని చెప్పింది. తాజాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సమావేశం (సీసీఈఏ) జరిగింది. ఇందులో గోధుమ ధరలపై కూడా చర్చించారు.

Export Of Wheat Flour: ఇప్పటికే గోధుమ ఎగుమతులపై భారత్ నిషేధం.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం

Export Of Wheat Flour, maida

Updated On : August 26, 2022 / 8:53 AM IST

Export Of Wheat Flour: భార‌త్‌లో పెరిగిపోతున్న ఆహార ధాన్యాల ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గోధుమ ఎగుమతులను నిషేధించింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. గోధుమ పిండి ధరలను కట్టడి చేయడానికి దాని ఎగుమతులపై పరిమితులు విధిస్తామని చెప్పింది. తాజాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సమావేశం (సీసీఈఏ) జరిగింది. ఇందులో గోధుమ ధరలపై కూడా చర్చించారు.

విదేశాలకు గోధుమపిండి ఎగుమతులను తగ్గించాలని, దీంతో గోధుమ పిండి ధరలు దిగివస్తాయని అధికారులు చెప్పారు. దీంతో భారత్ లోని పేదలకు ఆహార భద్రత ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు త్వరలో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. భారత్ నుంచి రష్యా, ఉక్రెయిన్‌కు గోధుమ పిండి అధికంగా ఎగుమతి అవుతోంది. ప్రస్తుతం ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుండడంతో ఆయా దేశాల్లో భారత గోధుమ పిండికి డిమాండ్‌ పెరిగింది.

దీంతో భారత్ లో గోధుమ పిండి ధరలు పెరిగిపోతున్నాయి. కాగా, కొన్ని వారాల క్రితమే ర‌వ్వ‌, మైదా, త‌దిత‌ర ఉత్ప‌త్తుల ఎగుమ‌తుల‌పై కూడా కేంద్ర ప్రభుత్వం ఆంక్ష‌లు విధించిన విషయం తెలిసిందే. ఈ మేర‌కు ఇప్పటికే డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఫార‌న్ ట్రేడ్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆయా ఉత్ప‌త్తుల ఎగుమ‌తులు చేయాల‌నుకుంటే మొద‌ట అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంది. గోధుమ పిండి, ర‌వ్వ‌, మైదా, త‌దిత‌ర ఉత్ప‌త్తుల ఎగుమ‌తుల‌పై పూర్తి స్థాయిలో మాత్రం నిషేధం విధించలేదు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సరఫరా వ్యవస్థల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం గోధుమ పిండికి విదేశాల్లో భారీగా గిరాకీ ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌-జూలై మధ్య ఆ పిండి ఎగమతుల్లో 200 శాతం వృద్ధి నమోదైందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంల భారత్ లో ధరలు పెరగకుండా కేంద్ర సర్కారు నిర్ణయాలు తీసుకుంటోంది.

Viral video: కొడుకుని ఎత్తుకుని రిక్షా తొక్కుతున్న తండ్రి.. కన్నీరు పెట్టిస్తోన్న వీడియో