Apple iPhones Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఐఫోన్ 13, ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఇందులో ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే?
Apple iPhone 13 Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలైంది.. ఆపిల్ ఐఫోన్ 13, ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ రెండు ఫోన్లలో ఏది కొంటే బెటర్ అని తెలుసుకోవాలని ఉందా?

Apple iPhones Sale _ iPhone 13 at Rs 56749, iPhone 14 at Rs 66749 on Flipkart sale
Apple iPhones Sale : ప్రముఖ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) ప్రారంభమైంది. ఈ సేల్ మే 4న ప్రారంభమై మే 10 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ (iPhone 13), ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అదనంగా, (e-commerce) ప్లాట్‌ఫారమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో భాగస్వామ్యం కలిగి ఉంది. తద్వారా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది.
బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Saving Days Sale) సందర్భంగా.. ఫ్లిప్‌కార్ట్ ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత ఆపిల్ ఐఫోన్ 13ని రూ. 57,999కి అందిస్తోంది. వాస్తవానికి రూ. 69,900కి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ దాదాపు రూ. 12వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అదనంగా, SBI బ్యాంక్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఈ ఫ్లాట్ తగ్గింపుపై రూ. 1,250 తగ్గింపును అందిస్తుంది. అన్ని డీల్స్ కలిసి ఐఫోన్ 13 ధరను రూ. 56,749కి తగ్గించాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ, చివరి ఎక్స్ఛేంజ్ వాల్యూ పూర్తిగా ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడు, ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14 డిస్కౌంట్ ఆఫర్‌కి వస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ ఐఫోన్ 14ని రూ. 67,999కి విక్రయిస్తోంది. అధికారిక ధర కన్నా దాదాపు రూ. 12వేలకు తగ్గింది. ఆపిల్ అధికారికంగా ఐఫోన్ 14ని రూ.79,900కి విక్రయిస్తోంది. అదనంగా, SBI బ్యాంక్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఈ ఫ్లాట్ తగ్గింపుపై రూ. 1250 తగ్గింపును అందిస్తుంది. అన్ని డీల్స్ కలిసి ఐఫోన్ 14 ధరను రూ.66,749కి తగ్గించాయి. అలాగే, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి కానీ, చివరి ఎక్స్ఛేంజ్ వాల్యూ పూర్తిగా ఫోన్, ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

Apple iPhones Sale_ iPhone 13 at Rs 56749, iPhone 14 at Rs 66749 on Flipkart sale
ఐఫోన్ 13 vs ఐఫోన్ 14 బెటర్ అంటే? :
బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 13, ఐఫోన్ 14లను భారీ డిస్కౌంట్లతో అందిస్తోంది. మీరు ఏ ఫోన్ కొనాలి?. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13తో పోల్చినప్పుడు.. లేటెస్ట్ iPhone 14ని కేవలం రూ. 10వేలు మాత్రమే అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 13ని కొనుగోలు చేయొచ్చు. రెండు ఫోన్‌లు ఒకే విధమైన డిజైన్, స్పెసిఫికేషన్‌లను అందిస్తాయి.
ఆపిల్ iPhone 14ని పొందడానికి ఎక్కువ ఖర్చు చేసే బదులు రూ. 10వేల తక్కువగా చెల్లించి ఐఫోన్ 13ని పొందవచ్చు. ఐఫోన్ 13, ఐఫోన్ 14 మోడల్ 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, వైడ్ నాచ్, A15 బయోనిక్ చిప్‌సెట్, లేటెస్ట్ సాఫ్ట్‌వేర్, డ్యూయల్ 12-MP వెనుక కెమెరా సిస్టమ్ వంటి ఫీచర్లతో వస్తుంది. రెండు ఫోన్‌లు అందించే బ్యాటరీ లైఫ్ కూడా ఒకేలా ఉంటుంది. రెండూ ఒకే ఛార్జ్‌పై 15 గంటల పాటు ఉంటాయి. మీరు రోజంతా వాడిన తర్వాత ఐఫోన్‌ను ఛార్జర్‌కి ప్లగ్ చేయొచ్చు.