iPhone 15 Price drop : వావ్.. వండర్‌ఫుల్.. అమెజాన్‌లో తక్కువ ధరకే ఐఫోన్ 15 కొనేసుకోండి.. ఇది కదా డీల్ అంటే..!

iPhone 15 Price drop : కొత్త ఐఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో ఐఫోన్ 15పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇలాంటి డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..

iPhone 15 Price drop : వావ్.. వండర్‌ఫుల్.. అమెజాన్‌లో తక్కువ ధరకే ఐఫోన్ 15 కొనేసుకోండి.. ఇది కదా డీల్ అంటే..!

iPhone 15 Price drop

Updated On : April 24, 2025 / 8:26 PM IST

iPhone 15 Price drop : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. అమెజాన్‌‌లో ఆపిల్ ఐఫోన్ 15 ధర భారీగా తగ్గింది. మీరు కూడా కొత్త ఐఫోన్‌ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. ప్రస్తుతం అమెజాన్‌లో లాస్ట్ జనరేషన్ ఆపిల్ ఐఫోన్ 15 బ్యాంక్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.

Read Also : Honor X70i Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? భారీ కెమెరాతో హానర్ X70i ఫోన్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!

ఈ ఆఫర్లతో ఆపిల్ కస్టమర్‌లు రూ.9,760 వరకు ఆదా చేసుకోవచ్చు. సాధారణంగా మార్కెట్లో ఐఫోన్ 15 ధర రూ.70వేలు ఉంటుంది. టైప్-C పోర్ట్, డ్యూయల్ కెమెరా, డైనమిక్ ఐలాండ్, అడ్వా్న్స్ పర్ఫార్మెన్స్, పవర్‌ఫుల్ కలర్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. కానీ, డిస్కౌంట్లు ధరను దాదాపు రూ.60వేలకి తగ్గించాయి. మీరు కొత్త ఫోన్ కోసం చూస్తుంటే.. ఐఫోన్ 15 బెస్ట్ అని చెప్పొచ్చు. అమెజాన్‌లో ఐఫోన్ 15 ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్‌లో ఐఫోన్ 15 ధర :
ప్రస్తుతం అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 15 (128GB స్టోరేజ్) ధర రూ.61,390కి అందుబాటులో ఉంది. HDFC, Federal ఇతర ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో వినియోగదారులు రూ.1,250 బ్యాంక్ డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. నెలకు రూ.2,976 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. కస్టమర్లు తమ బ్యాంక్ కార్డ్‌ని బట్టి నో-కాస్ట్ ఈఎంఐకి అర్హులు కావచ్చు.

పాత ఫోన్‌లను గరిష్టంగా రూ. 56,750 ఎక్స్ఛేంజ్ వాల్యూతో ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ వర్కింగ్ కండిషన్లు, మోడల్, వేరియంట్ ఆధారంగా వాల్యూ ఉంటుందని గమనించాలి. కస్టమర్లు ఎక్కువ పేమెంట్ చేస్తే.. AppleCare+ యాడ్-ఆన్‌గా కూడా కొనుగోలు చేయవచ్చు.

ఆపిల్ ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 16 6.1-అంగుళాల OLED ప్యానెల్‌ను కలిగి ఉంది. గరిష్ట ప్రకాశం 2వేల నిట్స్ వరకు ఉంటుంది. ఈ ఐఫోన్ A16 బయోనిక్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. సింగిల్ ఛార్జ్‌పై 26 గంటల వరకు వీడియోలను ప్లే చేయగలదు.

Read Also : Summer AC Problems : వేసవిలో ఏసీలు పేలుతాయి జాగ్రత్త.. ఈ 3 AC ఇష్యూలను అసలు నిర్లక్ష్యం చేయొద్దు.. ఈ స్మార్ట్ టిప్స్‌ తప్పక పాటించండి!

6GB LPDDR5 ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో వస్తుంది. ఈ ఐఫోన్ దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68 ధృవీకరించింది. ఐఫోన్ 15లో 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ షూటర్‌ కూడా ఉంది.