iPhone 16 : ఐఫోన్ 15 కన్నా ఐఫోన్ 16 చాలా చీప్ గురూ.. ధర ఎంత తగ్గిందో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!
iPhone 16 : కొత్త ఐఫోన్ కొంటున్నారా? అయితే, కాస్తా ఆగండి.. ఐఫోన్ 15 కన్నా ఐఫోన్ 16 తక్కువ ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 16
iPhone 16 : కొత్త ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఆపిల్ ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింది. ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 16 భారత మార్కెట్లో అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఆపిల్ అభిమానులు ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
లేటెస్ట్ డిస్కౌంట్, అదనపు బ్యాంక్ ఆఫర్లతో ఐఫోన్ 16 ధర ఇప్పుడు ఐఫోన్ 15 దాదాపు దగ్గరగా ఉంది. ఐఫోన్ 15 కన్నా ఐఫోన్ 16 అత్యంత చౌకగా లభ్యమవుతోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత సరసమైన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో ఐఫోన్ 16 కూడా ఒకటిగా చెప్పవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ధర తగ్గింపు :
ఐఫోన్ 16 (128GB) వేరియంట్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.74,990కే లిస్ట్ అయింది. లాంచ్ ధర రూ.79,900 నుంచి తగ్గింది. ముందుగా రూ. 5వేల ధర తగ్గింపు వర్తిస్తుంది. ఆ తర్వాత
అదనంగా రూ. 4,500 బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
2,500 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు. చివరికి ఐఫోన్ 16 ధర రూ. 67,990కు కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ,
మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ బట్టి రూ.63,200 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
ఐఫోన్ 16 vs ఐఫోన్ 15 భారత్ ధర :
ఆసక్తికరంగా.. ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ తర్వాత రూ.10వేల ధర తగ్గిన ఐఫోన్ 15 (128GB) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.64,400 వద్ద లిస్టు అయింది. కానీ, ఆఫర్‌లతో సహా ఐఫోన్ 16, ఐఫోన్ 15 దాదాపు ఒకే ధరలో ఉన్నాయి. కొత్త మోడల్‌ను కూడా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 16 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
- ఐఫోన్ 15 కన్నా ఐఫోన్ 16 మెయిన్ అప్‌గ్రేడ్స్ అందిస్తుంది.
- డైనమిక్ ఐలాండ్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR ఓఎల్ఈడీ డిస్‌ప్లే
- 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 60Hz రిఫ్రెష్ రేట్
- లేటెస్ట్ A18 బయోనిక్ చిప్‌సెట్
- డ్యూయల్ రియర్ కెమెరాలు : 48MP మెయిన్ + 12MP అల్ట్రా-వైడ్
- సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా
- ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో iOS 18 రన్ అవుతుంది.
- క్విక్ ఫొటో/వీడియో యాక్సెస్ కోసం ప్రత్యేకమైన క్యాప్చర్ బటన్
ఐఫోన్ 16 కొనడం బెటరా? :
ఐఫోన్ 16 ధర ఇప్పుడు ఐఫోన్ 15 ధరతో సమానంగా ఉంది. వినియోగదారులు కొత్త ప్రాసెసర్, ఆకర్షణీయమైన కెమెరా ఫీచర్లు, లేటెస్ట్ iOS 18 సపోర్టు పొందవచ్చు. డైనమిక్ ఐలాండ్, ఆపిల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కూడా యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.