Badminton Pros: ‘బ్యాడ్మింటన్ ప్రోస్’ మెంటార్‌గా సైనా నెహ్వాల్
బ్యాడ్మింటన్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో 'బ్యాడ్మింటన్ ప్రోస్'ను నిర్వహిస్తున్నారు. వర్ధమాన బ్యాడ్మింటన్ క్రీడాకారుల ప్రతిభను..

Saina Nehwal
Saina Nehwal: ప్రీమియర్ బ్యాడ్మింటన్ కోచింగ్ అకాడమీ ‘బ్యాడ్మింటన్ ప్రోస్’ సైనా నెహ్వాల్‌ను మెంటార్‌గా ఎంచుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. భారత బ్యాడ్మింటన్ భవిష్యత్తు మరింత ప్రకాశం వెలుగొందేందుకు తమ నిర్ణయం దోహదపడుతుందని చెప్పింది.

Saina Nehwal, Parupalli Kashyap and GurusaiDutt
ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ అనుభవం, అంకితభావం తదుపరి తర భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తాయని పేర్కొంది. ‘బ్యాడ్మింటన్ ప్రోస్’కు ఇప్పటికే పారుపల్లి కశ్యప్, ఆర్‌ఎంవీ గురుసాయిదత్ తమ సేవలు అందిస్తున్నారు. మెంటార్ గా సైనా నెహ్వాల్ యువ షట్లర్ల నైపుణ్యాల అభివృద్ధి, మానసిక దృఢత్వం వంటివాటికి కృషి చేస్తుంది.
బ్యాడ్మింటన్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో ‘బ్యాడ్మింటన్ ప్రోస్’ను నిర్వహిస్తున్నారు. వర్ధమాన బ్యాడ్మింటన్ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి దీన్ని స్థాపించారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రముఖ నగరాల్లో ‘బ్యాడ్మింటన్ ప్రోస్’ పనిచేస్తోంది. ‘బ్యాడ్మింటన్ ప్రోస్’లో చేరడంపై సైనా నెహ్వాల్ హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తనకు ఎంతో ఇచ్చిన బ్యాడ్మింటన్ క్రీడకు తిరిగి తనవంతుగా సేవలు అందించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని చెప్పారు.
World Cup 2023 IND vs AFG ODI : రోహిత్ పెను విధ్వంసం.. అఫ్గానిస్థాన్ పై భారత్ ఘన విజయం..