బిగ్ బ్రేకింగ్ : ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఫేక్ అకౌంట్ల తొలగింపు, ప్రొఫైల్ పిక్ మారిస్తే బెటర్
ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఫేక్ అకౌంట్ల తొలగింపు చేపట్టింది. వారం రోజులుగా జరుగుతున్న ఈ ఆపరేషన్ లో భాగంగా.. ఇప్పటికే 20 లక్షల ఫేక్ అకౌంట్లను బ్లాక్ చేసింది కంపెనీ.

ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఫేక్ అకౌంట్ల తొలగింపు చేపట్టింది. వారం రోజులుగా జరుగుతున్న ఈ ఆపరేషన్ లో భాగంగా.. ఇప్పటికే 20 లక్షల ఫేక్ అకౌంట్లను బ్లాక్ చేసింది కంపెనీ.
ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఫేక్ అకౌంట్ల తొలగింపు చేపట్టింది. వారం రోజులుగా జరుగుతున్న ఈ ఆపరేషన్ లో భాగంగా.. ఇప్పటికే 20 లక్షల ఫేక్ అకౌంట్లను బ్లాక్ చేసింది కంపెనీ. ఈ సంఖ్య మరింత పెరగనున్నట్లు సమాచారం. ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్న ఫేక్ అకౌంట్ల నుంచి టార్గెట్ ఐటమ్స్ వస్తున్నాయని, తప్పుడు ప్రచారం జరుగుతుందని గుర్తించిన కంపెనీ.. ఈ చర్యకు దిగింది.
ఎప్పుడు ఎవరి అకౌంట్ బ్లాక్ అవుతుందో అర్థం కాక నెటిజన్లు ఆందోళనలో ఉన్నారు. మొన్నటికిమొన్న తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు రేపింది ఈ వ్యవహారం. జనసేన పార్టీకి చెందిన వందల అకౌంట్లను బ్లాక్ చేసింది. దీంతో ఇది రాజకీయ రంగు కూడా పులుముకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ చేయిస్తుందంటూ జనసేన కూడా ఫేక్ బుక్ నుంచి కౌంటర్ అటాక్ చేసింది. అదే విధంగా టీడీపీకి చెందిన కొందరి అకౌంట్లు కూడా బ్లాక్ అయ్యాయి. వారు కూడా ఇదే వాదన తెరపైకి తెచ్చారు.
వేల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న అకౌంట్లు సైతం బ్లాక్ చేయటం సంచలనంగా మారింది. దీనికి కారణం ట్విట్టర్ యాజమాన్యమే. ఇండియా, చైనా, స్పెయిన్, అరబ్ ఎమిరేట్స్, హాంగ్ కాంగ్ ప్రాంతాలకు చెందిన లక్షల అకౌంట్లు బ్లాక్ చేసినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఇండియాలో ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా వచ్చిన చాలా అకౌంట్లు బ్లాక్ అయ్యాయి. అదే విధంగా కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నడుస్తున్న ట్విట్టర్ అకౌంట్లు కూడా ఉండటం విశేషం. అదే విధంగా ప్రభుత్వాలకు ప్రోగా, భజన చేసే అకౌంట్లను బ్లాక్ చేయటం కలకలం రేపుతోంది.
అవీఇవీ అని కాకుండా రాజకీయ భజన చేయటంతోపాటు రాజకీయ అంశాలను పోస్టు చేసే ట్విట్టర్ అకౌంట్లు అన్నీ కూడా దాదాపు బ్యాన్ చేయాలని కంపెనీ నిర్ణయించటం సంచలనంగా మారింది. ముఖ్యంగా ప్రొఫైల్ పిక్చర్ అనేది అకౌంట్లకు మైనస్ గా మారింది. నెటిజన్లు ఆయా పార్టీలకు సంబంధించిన పార్టీ సింబల్స్, జెండాలు, అధినేతల ఫొటోలు పెట్టుకున్నారు. ఇవన్నీ దాదాపు బ్లాక్ అవుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. సో.. ఇప్పటికైనా నెటిజన్లు బేసిక్ గా.. ప్రొఫైల్ ఫొటో మార్చినట్లయితే బ్లాక్ లిస్ట్ నుంచి 20 శాతం తప్పించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.